Credits: Twitter

Bhubaneswar, Dec 16: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశాలోని (Odisha) పూరి జగన్నాథస్వామి (Puri Jagannath) ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోకి (Inside Temple) సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిస్థాయిలో నిషేధించారు. ఇప్పటి వరకు ఈ నిబంధన భక్తులకు (Devotees) మాత్రమే ఉండేది. ఇకపై పోలీసు సిబ్బందితోపాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

సెలవుల కేలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి బ్యాంకులకు నో హాలిడే!

ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ ఫోన్లను ఆలయం బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఆలయ అధికారులు, సేవకులు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్లు లేని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకెళ్లొచ్చని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వీర్ విక్రమ్ యాదవ్ తెలిపారు.

బాలయ్య అన్ స్టాపబుల్-2 టాక్ షోకి పవన్ కల్యాణ్...? హింట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఆహా వీడియో వైరల్