Maldives Fire: మాలేలో ఘోర అగ్నిప్రమాదం, తొమ్మిది మంది భారతీయులతో సహా 10 మంది సజీవ దహనం, మంటల్లో చిక్కుకున్న పలువురు విదేశీ కార్మికులు
వారిలో తొమ్మిది మంది భారతీయ కార్మికులు ఉన్నారు.
Maldives, Nov 10: మాల్దీవుల రాజధాని మాలేలో ఘోర అగ్నిప్రమాదం (Maldives fire) సంభవించింది.రాజధాని మాలేలోని విదేశీ కార్మికుల వసతి గృహాలలో గురువారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో పది మంది మరణించారు. వారిలో తొమ్మిది మంది భారతీయ కార్మికులు (Nine Indians killed in Maldives fire) ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం మంటల్లో మరికొంతమంది గాయపడ్డారు.
బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వెహికిల్ రిపేర్ గ్యారేజీలో చెలరేగిన మంటలు.. పైఫ్లోర్‌లకు విస్తరించినట్లు అధికారులు ధృవీకరించారు. నాలుగు గంటలపాలు మంటలు చెలరేగుతూనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా చోటుచేసుకుందని సమాచారం. మృతుల సంఖ్యపై (workers killed) మరింత స్పష్టత రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం మొదలుపెట్టాయి.
విదేశీ కార్మికులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నాయి. మాలే జనాభా రెండున్నర లక్షలుగా ఉంటే.. అందులో బంగ్లాదేశ్, భారత్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక నుంచే సగం జనాభా ఉంది. ఖతార్‌లో దక్షిణాసియా కార్మికుల దోపిడీ మరియు మరణాల కథనాల చుట్టూ సంచలనం జరుగుతున్న సమయంలో మాల్దీవులలో భారతీయ కార్మికుల మరణ వార్త వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మరియు బంగ్లాదేశ్ కార్మికుల స్థితి గతిని జూలైలో భారత ప్రభుత్వం నిర్దేశించిన నివేదికలలో గ్రహించబడింది.2019-2021 మధ్య కాలంలో గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల్లో అత్యధికులు భారతీయులేనని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, 2020లో సౌదీ అరేబియాలోనే వారి సంఖ్య 3,753కి చేరుకుంది
నవంబర్, 2019లో, వివిధ దేశాల్లో పని చేస్తున్న భారతీయ కార్మికుల భవితవ్యానికి సంబంధించిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధన్ స్పందిస్తూ, 2014 నుండి మొత్తం 33,998 మంది భారతీయ వలస కార్మికులు మరణించారని చెప్పారు.