Afghanistan Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న మారణహోమం, రంజాన్ ఉపవాసం ముగించేందుకు వెళ్తున్నవారిపై బాంబు దాడి, తొమ్మిది మంది మృతి, 13 మందికి పైగా గాయాలు

ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Kabul, April 29: ఆఫ్ఘనిస్తాన్‌లోని (Afghanistan) మజార్-ఇ-షరీఫ్‌లో గురువారం మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు (Bomb Blast) సంభవించినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. మజార్-ఇ-షరీఫ్‌లోని వివిధ జిల్లాలలో గురువారం నాటి పేలుళ్లు ఒకదానికొకటి నిమిషాల వ్యవధిలో సంభవించాయి. రంజాన్ (Ramadan) సందర్భంగా ప్రయాణికులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి విడిచిపెట్టడానికి ఇంటికి వెళుతుండగా ఈ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నట్లు బల్ఖ్ ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఆసిఫ్ వజిరి చెప్పారు. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజా ఘటనతో తాలిబన్ (Taliban) బలగాలు అప్రమత్తమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్‌ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే గతేడాది ఆగస్టులో తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ తెలిపింది.

China: చైనాను కలవరపెడుతున్న మరో కొత్త వైరస్, తొలిసారిగా మనుషులకు పాకిన ఏవియన్ ఫ్లూ H3N8 వైరస్, జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు

సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన చిత్రాలను పరిశీలించగా.. ఒక మినీబస్సు మంటల్లో చిక్కుకుపోగా, మరొకటి కాలిపోయిందని, తాలిబాన్లు బాధితులను వాహనం నుండి ఆసుపత్రులకు తరలించారని స్థానికులు పేర్కొన్నారు. తాజాగా ఘటనకు బాధ్యులుగా ఐఎస్ఐఎస్ పేర్కొంది. అయితే కుందుజ్‌లో, కాబూల్ పాఠశాలలో జరిగిన బాంబు దాడికి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఎక్కువగా హజారా కమ్యూనిటీకి చెందిన షియా ఆఫ్ఘన్‌లు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క 38 మిలియన్ల జనాభాలో 10 నుండి 20 శాతం మధ్య ఉన్నారు. సున్నీ-మెజారిటీ ఆఫ్ఘనిస్తాన్‌లోని IS ప్రాంతీయ శాఖ ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక శాఖను అనుసరించే షియాలను, సూఫీలు ​​వంటి మైనారిటీలను పదేపదే లక్ష్యంగా చేసుకుంది.

Covid in China: చైనాలో ఘోరంగా మారిన కరోనా పరిస్థితులు, తాజాగా షాంఘైలో ముగ్గురు మృతి, లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన 40 కోట్ల మంది ప్రజలు

ఇదిలా ఉంటే ఇటీవలి దాడులకు సంబంధించి పలువురిని అరెస్టు చేశామని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ దాడులు మసీదులు, పాఠశాల వంటి భద్రత లేని ప్రదేశాల్లో చోటు చేసుకుంటున్నాయని, అయితే ఇప్పుడు మేము అలాంటి ప్రదేశాల్లోనూ భద్రతను పంచామని చెప్పారు.