Shanghai, April 18: సోమవారం మీడియా నివేదిక ప్రకారం, చైనా ఆర్థిక కేంద్రమైన షాంఘై COVID-19 వ్యాప్తి యొక్క మొదటి మరణాలను నివేదించింది, అలాగే గత 24 గంటల్లో 2,417 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. మరణించిన ముగ్గురు వ్యక్తులు 89 మరియు 91 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
చైనా అంతటా, నగరాలు తమ నివాసితులను లాక్ చేస్తున్నాయి, సరఫరా లైన్లు చీలిపోతున్నాయి. ప్రాథమిక వస్తువుల తరలింపును భద్రపరచడానికి అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 44 చైనీస్ నగరాలు పూర్తి లేదా పాక్షిక లాక్‌డౌన్‌లో ఉన్నాయి, ఎందుకంటే అధిక ప్రసారం చేయగల Omicron వేరియంట్ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు కఠినమైన నియంత్రణ చర్యలు అవలంభిస్తున్నారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో మార్చి 1 నుండి మంగళవారం నాటికి షాంఘైతో సహా 31 ప్రావిన్సులలో 320,000 కంటే ఎక్కువ స్థానిక COVID-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య అధికారులు తెలిపారు. కొన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు మూసివేయబడ్డాయి.
కరోనా మలిదశలో చైనాలో కరోనా మరణాలు (Covid Deaths in China) నమోదవడం ఇది రెండోసారి. గత నెలలో జిలిన్ ప్రావిన్స్‌లో మహమ్మారికి ఇద్దరు బలయ్యారు. గత నెలలో జిలిన్ ప్రావిన్స్‌లో మహమ్మారికి ఇద్దరు (China's Shanghai reports first Covid deaths) బలయ్యారు. 25 మిలియన్లకుపైగా జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ బుధవారం నాటికి వైరస్‌ను నిలువరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో నగరవాసులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది.
జీరో టోలరెన్స్ పేరిట జనాలను మానసికంగా హింసిస్తోంది చైనా ప్రభుత్వం ఇప్పుడు. వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం, కరోనాను ఎదుర్కొగలిగే పరిస్థితులు ఉన్నా కూడా ‘స్టే హోం.. స్టే సేఫ్’ పాలసీకే మొగ్గు చూపిస్తోంది. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ కఠినమైన లాక్‌డౌన్ అమలు అవుతోంది. వైద్య సిబ్బంది, డెలివరీ బాయ్స్, ఎమర్జెన్సీ స్టాఫ్ తప్ప.. ఎవరూ బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, మందులు దొరక్క జనాలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ.. సడలింపులకు ప్రభుత్వం నో అంటోంది.
షాంఘై చుట్టుపక్కల నగర వాసుల్లో ఇప్పుడు లాక్‌డౌన్ ఫియర్ మొదలైంది. రెండువారాల పాటు అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. తమ దగ్గరా షాంఘై తరహా పరిస్థితులు పునరావృతం అవుతుందని వణికిపోతున్నారు. ఇప్పటికే కొందరు ఎమర్జెన్సీ పాసులతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేదే లేదని తెగేసి చెప్తున్నారు. షాంగ్జి ప్రావిన్స్ రాజధాని జియాన్ నగరం ఇదివరకే లాక్‌డౌన్ అక్కడి ప్రజలకు చీకట్లు మిగల్చగా.. తాజాగా మరోసారి లాక్‌డౌన్ ప్రకటించడంతో వణికిపోతున్నారు. ఇక అధికారులు మాత్రం ఇది తాత్కాలిక చర్యలు మాత్రమేనని, వైరస్ కట్టడికి ప్రజలు కొంతకాలం ఓపిక పట్టాలని చెప్తున్నారు. అయినా ప్రజల్లో మాత్రం మనోధైర్యం నిండడం లేదు. షాంఘై పరిస్థితులను కళ్లారా చూడడంతో కరోనా కంటే లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు.
షాంఘైలో ఉన్నత కుటుంబాలు తప్ప మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు నిరసనలు హోరెత్తుతున్నాయి. బారికేడ్లను బద్ధలు కొట్టి మరీ ఆహారం కోసం పరుగులు తీస్తున్నారు అక్కడి జనాలు. వైద్యం అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అంతేకాదు.. నిరసనలను నియంత్రించలేక పోలీసులు దాడులు చేస్తున్న ఘటనలు, మూగజీవాల అవసరాల కోసం బయటకు తీసుకొస్తే.. వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.