కరోనా తీవ్రతతో అల్లాడిపోతున్న చైనాలోని షాంగైలో ఇప్పటికే పరిస్థితులు విషమించాయి. రోజుల తరబడి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన జనం ఆహారం, నిత్యావసర వస్తువులు నిండుకొని ఆకలితో అలమటించిపోతున్నారు. తినడానికి ఏమీ లేదు ఆదుకోవాలంటూ ఇళ్లలోని బాల్కానీలు, కిటికీల్లోంచి అరుపులు, కేకలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. షాంగైలో అధికారులు సరఫరా చేస్తున్న ఆహార పదార్ధాలు సరిపోకపోవడంతో జనం ఆంక్షలను పట్టించుకోకుండా రోడ్ల మీదకు వస్తున్నారు.. అక్కడక్కడా షాపుల లూటీలు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితులను ఆదుపు చేసేందుకు మరింత కఠినగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సర్వీసులు మినహా ఎవరూ రోడ్ల మీదకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)