Maine Disqualifies Trump: డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో రాష్ట్రం, ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటించిన మైనే, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో అమెరికా మాజీ అధ్యక్షుడు

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని కొలరాడో కోర్టు ప్రకటించిన విషయం మరువక ముందే మరో రాష్ట్రం కూడా కూడా అనర్హత వేటు వేసింది.

Donald Trump. (Photo Credits: Facebook)

Maine blocks Trump from its Republican presidential primary: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)కు మరో షాక్‌ తగిలింది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని కొలరాడో కోర్టు ప్రకటించిన విషయం మరువక ముందే మరో రాష్ట్రం కూడా కూడా అనర్హత వేటు వేసింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ మైనే (Maine) రాష్ట్రం గురువారం ప్రకటించింది.

ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి.. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా గురువారం ప్రకటించారు. మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు. మరోవైపు కొలరాడో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ బుధవారం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. 2021, జ‌న‌వ‌రి ఆరో తేదీన జ‌రిగిన క్యాపిట‌ల్ హిల్ (US Capitol) అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

డొనాల్డ్ ట్రంప్‌ అరెస్ట్ వెనుక కారణాలేంటి, పోర్న్‌స్టార్‌తో ఆయనకు ఉన్న అనైతిక ఒప్పందం ఖరీదు ఎంత, 34 అభియోగాల్లో 136 ఏళ్ల జైలుశిక్ష తప్పదా..

2021లో కేపిటల్‌ భవనంపై జరిగిన దాడి కేసులో ట్రంప్‌ ప్రమేయాన్ని నిర్ధారించి రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా అతని పేరును బ్యాలెట్‌లోంచి తొలగించాలని ఆదేశించింది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం.తాజాగా మైనే ఎన్నికల అధికారులు కూడా పోటీకి అనర్హుడని ప్రకటించారు.