Mystery Disease in South Sudan: మరో భయంకరమైన వ్యాధి వెలుగులోకి, ఇప్పటికే దీని దెబ్బకు 89 మంది మృతి, సౌత్ సౌడాన్‌లో అంతుచిక్కని వ్యాధిని గుర్తించే పనిలో WHO
సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతుండగానే మరో భయకంరమైన వ్యాధి (Mystery Disease in South Sudan) బయటకు వచ్చింది.
South Sudan, Dec 16: సౌత్ ఆఫ్రికాలో పుట్టినట్లుగా గుర్తించబడి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ అనే కొత్త రకం కరోనా వైరస్ నుంచి ఇంకా తేరుకోకముందు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతుండగానే మరో భయకంరమైన వ్యాధి (Mystery Disease in South Sudan) బయటకు వచ్చింది. సౌత్ సూడాన్‌లో ఓ మిస్టరీ వ్యాధి జనాలను భయకంపితులను చేస్తోంది.
బీబీసీ ప్రచురించిన కథనం ప్రకారం.. దక్షిణ సూడాన్‌లోని జోంగ్లీ రాష్ట్రంలో (Jonglei state) ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో అక్కడ చాలా వ్యాధులు వ్యాప్తి చెందాయి. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా రావడం, వరదల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు మూడు పూటలా ఆహారం కూడా దొరకకపోవడంతో చాలామంది పిల్లల్లో పౌష్టికాహారలోపం తలెత్తింది. తాగే నీళ్లు కలుషితం అయ్యాయి. దీంతో జోంగ్లీలోని ఫంగక్ అనే నగరంలో 89 మంది మరణించినట్టు సౌత్ సుడాన్ మంత్రి కుగ్వాంగ్ స్పష్టం చేశారు.
వైద్యాధికారులు అసలు వీళ్లకు ఏ వ్యాధి (unidentified illness) సోకిందో తెలుసుకునే పనిలో పడ్డారు. చాలామంది తీవ్ర అస్వస్తతకు గురవగా... వేల మంది అనారోగ్యానికి లోనయ్యారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization (WHO) సూడాన్‌కు కొందరు సైంటిస్టుల బృందాన్ని పంపి.. అక్కడ సోకిన వ్యాధి గురించి ఆరా తీయాలని తెలిపింది. సైంటిస్టులు.. వాతావరణ కాలుష్యం వల్ల ఏదైనా భయంకరమైన వైరస్ సోకిందా? లేక ఇతర వ్యాధి సోకిందా అనే పనిలో పడ్డారు .
ఇటీవల జోంగ్లీలో కురిసిన వర్షాలకు, వరదలకు సుమారు 7 లక్షలకు పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ వరదల వల్ల కొత్త కొత్త రోగాలు వచ్చి ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదికి రావడంతో అక్కడ పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఎంఎస్ఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే దక్షిణ సూడాన్‌లో వరదలు ముంచెత్తిన ప్రాంతాలకు చేరుకోవడం, ప్రభావితమైన వారికి సహాయం అందించాలనే లక్ష్యం ఒక సవాలుగా మారిందని UN పేర్కొంది. మే నుండి దేశవ్యాప్తంగా 835,000 మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని ఏజెన్సీ తెలిపింది. దేశంలోని ఉత్తర ప్రాంతంలోని జోంగ్లీ మరియు రెండు చమురు ఉత్పత్తి రాష్ట్రాలైన యూనిటీ మరియు అప్పర్ నైలులోని ప్రజలు ఎక్కువగా ప్రభావితమైనట్లు నివేదించబడింది.
గత వారం, బెంటియును సందర్శించిన దక్షిణ సూడాన్‌లోని UN శాంతి పరిరక్షక మిషన్ అధిపతి నికోలస్ హేసోమ్ పరిస్థితి "భయంకరమైనది" అని వివరించారు. వరద నీరు తగ్గుముఖం పట్టడం లేదని, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వారికి సహాయం అవసరమని ఆయన అన్నారు. ఆహార అభద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పరంగా వచ్చే పరిణామాలు వినాశకరమైనవి అని ఆయన అన్నారు.
ప్రపం, ఆరోగ్యం సంస్థ ప్రకారం.. దక్షిణ సూడాన్ కు 5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు పంపబడ్డాయి. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా, జాన్సన్ & జాన్సన్ కంపెనీల వ్యాక్సిన్లు ఆదేశానికి పంపారు.అయితే అవన్నీ అక్కడ వృథాగా పడి ఉన్నాయి. 11 మిలియన్ల జనాభాలో దాదాపు 180,000 మంది మాత్రమే టీకాలు వేసుకున్నారు. మిగిలినవి అలానే ఉండిపోయాయి. ప్రజలంతా టీకాలు వేసుకోవాలని మేము అభ్యర్థిస్తూనే ఉన్నామని WHO యొక్క కోవాక్స్ దక్షిణ సూడాన్‌లోని కోఆర్డినేటర్ డాక్టర్ బ్రెండన్ డినీన్ చెబుతున్నారు.