UK, Dec 13: యూకేలో త్వరలో మళ్లీ కరోనా ఆంక్షలు విధించకోపోతే ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in UK) భారీగా పెరిగే అవకాశం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు శనివారం హెచ్చరించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, ఇన్‌ఫెక్షన్ల రేటు చాలా ఎక్కవగా ఉండటంతో ఆస్పత్రులలో కేసుల సంఖ్య (Coronavirus in UK) భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ నిక్ డేవీస్ అన్నారు.
యూకేలో శనివారం తాజాగా 633 కొత్త ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,898కు చేరింది. ఇంగ్లాండ్‌లో సగటున కేసుల సంఖ్య ప్రతి 2.4 రోజులకు రెట్టింపు అవుతోంది. యూకే ప్రభుత్వం శుక్రవారం నుంచి సినిమా హాళ్లు, ప్రార్థనా స్థలాలు, మ్యూజియంలు, క్రీడా స్టేడియంలలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆంక్షలు విధించింది. కరోనావైరస్ హెచ్చరిక స్థాయిని మూడు నుండి నాలుగుకు పెంచింది,
UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) సలహా మేరకు యునైటెడ్ కింగ్‌డమ్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్‌లోని అన్ని ప్రాంతాల చీఫ్ మెడికల్ ఆఫీసర్లు (CMOలు) హెచ్చరిక స్థాయిని పెంచారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని వారు తెలిపారు. అలాగే ఇది టీకాలకు కూడా లొంగడం లేదని తెలిపింది. ఓమిక్రాన్ బారీన పడిన వారితో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఓమిక్రాన్ పోరాటంలో టీకా రక్షణ తగ్గినప్పుడు, ఆ రక్షణను బూస్టర్‌తో టాప్ అప్ చేయడం చాలా అవసరం. రెండు బూస్టర్ వ్యాక్సిన్‌లు (ఫైజర్ మరియు మోడర్నా) రోగనిరోధక ప్రతిస్పందనను గణనీయంగా పెంచుతాయి మరియు డెల్టాతో పోలిస్తే కొంత తగ్గింపుతో మంచి ప్రభావాన్ని చూపుతాయి" అని పరిశోధకులు చెప్పారు. UK గత కొన్ని నెలలుగా కరోనాలో మూడవ స్థాయిలో ఉంది. అలాగే గత మేలో నాలుగో స్థాయిలో ఉంది. ఈనేపథ్యంలో నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) బూస్టర్ ప్రోగ్రామ్ సోమవారం నుండి 30 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ బుకింగ్‌ల కోసం తెరవబడినందున ఈ తాజా హెచ్చరిక వచ్చింది.