Sheikh Hasina: షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మాకు అప్పగించండి.. భారత్ ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోయేషన్
యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ విడిచిపెట్టి వచ్చి భారత్ లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి.
Newdelhi, Aug 7: యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ (Bangladesh) విడిచిపెట్టి వచ్చి భారత్ (India) లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను (Sheikh Hasina) అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. షేక్ హసీనాను అరెస్ట్ చేసి ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్ ను కోరారు. హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానాను అరెస్టు చేయాలని అన్నారు. బంగ్లాదేశ్ లో మరణాలకు షేక్ హసీనా బాధ్యత వహించాలని, అందుకే ఆమెను అరెస్టు చేసి తమను అప్పగించాలంటూ భారత్ ను కోరినట్లు మీడియాతో అన్నారు.
అభ్యర్ధన అంగీకరించాలి
భారత్ తో సానుకూల సంబంధాలను కొనసాగించడం తమకు ముఖ్యమని, కాబట్టి తమ అభ్యర్ధనను భారత్ అంగీకరించాలని ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ స్పష్టం చెప్పారు. అయితే, ఖోకాన్ అభ్యర్ధనపై భారత్ ఇంకా స్పందించాల్సిఉంది.