Terror Attack at Karachi Airport: కరాచీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. చైనీయులే లక్ష్యంగా దాడి.. ముగ్గురు మృతి
ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో వణికిపోతున్నది.
Karachi, Oct 7: పాములు పట్టే వ్యక్తి ఆ పాము కాటుకే బలైనట్టు ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో (Terror Attack) వణికిపోతున్నది. కరాచీలోని (Karachi) జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులతోపాటు ఒక పాకిస్థానీ మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత జరిగిందని, ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్ లో పేలుడు సంభవించిందని చైనీస్ ఎంబసీ ప్రకటించింది.
మేమే చేశాం..
పాక్ లో ఉగ్ర దాడికి పాల్పడింది తామేనంటూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న చైనీస్ ఇంజినీర్లు, ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు తెలిపింది.