Anthrax Pneumonia in China: చైనాలో కొత్తగా ఆంత్రాక్స్‌ నిమోనియా వైరస్, గొర్రెలు, పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న ఆంత్రాక్స్‌ వ్యాధి, మరోవైపు డ్రాగన్ కంట్రీలో మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

రోగిలో నాలుగు రోజుల క్రితమే లక్షణాలు కనిపించడంతో బీజింగ్‌కు తరలించారు. సదరు వ్యక్తికి ఆంత్రాక్స్‌ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. అంత్రాక్స్‌ ఓ బ్యాక్టీరియా.

Pneumonia (Photo Credits: Pexels)

Beijing, August 10: చైనాలోని ఉత్తర హెబే రాష్ట్రంలోని చెంగ్డే (Hebei Province’s Chengde City) నగరంలో ఆంత్రాక్స్‌ నిమోనియా కేసు (Anthrax Pneumonia in China) నమోదైంది. రోగిలో నాలుగు రోజుల క్రితమే లక్షణాలు కనిపించడంతో బీజింగ్‌కు తరలించారు. సదరు వ్యక్తికి ఆంత్రాక్స్‌ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. అంత్రాక్స్‌ ఓ బ్యాక్టీరియా. ఇది గొర్రెలు, పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. బాధితుడు పశువులు, మేకలకు దగ్గరగా వెళ్లాడని అధికారులు తెలిపారు. దీనిపై ప్రభావవంతంగా పనిచేసే యాంటిబయాటిక్స్‌ అందుబాటులో ఉన్నాయి.

అనారోగ్యంతో ఉన్న పశువులు, సంపర్కం ద్వారా ఆంత్రాక్స్ సోకుతుంది. ఈ మేరకు బీజిగ్ సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఆంత్రాక్స్ న్యూమోనియా (Anthrax Pneumonia Case) చాలా డేంజర్. ధూళి ద్వారా జనాలకు సోకుతుంది. కలుషిత ఆహారం, మాంసం ద్వారా కూడా ఆంత్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆంత్రాక్స్ వస్తే వికారం, వాంతులు, విరేచనాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలిపారు. ఆంత్రాక్స్ (Anthrax Pneumonia) నేరుగా మనుషుల ద్వారా వ్యాపిస్తోంది. జలుబు, కరోనా మాదిరిగా ఇది అంటు వ్యాధి మాత్రం కాదు.

డెల్టాతో అమెరికాకు మరో పెను ముప్పు, రోజు రోజుకు భారీగా పెరుగుతన్న కరోనా కేసులు, భారత్‌లో తాజాగా 28,204 మందికి కోవిడ్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,88,508 యాక్టివ్‌ కేసులు

ఇక కరోనా కేసులు తొలిగా వెలుగు చూసిన చైనాలో మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తోంది. వూహాన్‌లో కూడా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ కోటిపైగా కరోనా టెస్టులు కూడా నిర్వహించారు. అయితే ఇలా కరోనా కేసులు పెరగడంతో కొందరు అధికారులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరిని అసలు ఉద్యోగంలో నుంచి తొలగించగా.. మరికొందరికి ఇతర శిక్షలు విధించినట్లు తెలుస్తోంది.

ఇలా సుమారు 30 మంది ఉన్నతాధికారులను చైనా శిక్షించిందని సమాచారం. వీళ్లంతా తమ తమ పరిధుల్లో వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. వీరిలో ఒక వైస్ మేయర్, కొన్ని పట్టణాల, హెల్త్ కమిషన్లు అధికారులు, ఆస్పత్రి నిర్వహణా సిబ్బంది, ఎయిర్‌పోర్టు, టూరిజం శాఖల అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చైనాలో కూడా డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif