China Snooping: చైనా భారీ కుట్ర, దేశంలో అగ్రనేతలపై రహస్య నిఘా, సంచలనం రేపుతున్న జాతీయ పత్రిక కథనం, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కేంద్రం తెలిపినట్లుగా మరో పత్రిక కథనం

సరిహద్దుల్లో భారత ఆర్మీతో తలపడలేని డ్రాగన్ కంట్రీ దొంగ దెబ్బ తీయడానికి అవసరమైన అన్ని మార్గాలను వాడుకుంటోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు (India-China Standoff) ఉన్న తరుణంలో చైనా దేశంలోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా (China's Snooping on VIPs) పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్‌కు చెందిన కీలక సంస్థలపై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టిందని జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది.

Chinese President Xi Jinping (Photo Credits: Getty Images)

New Delhi, Sep 14: గత రెండు నెలలుగా భారత్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా మరో దుస్సాహసానికి తెరలేపింది. సరిహద్దుల్లో భారత ఆర్మీతో తలపడలేని డ్రాగన్ కంట్రీ దొంగ దెబ్బ తీయడానికి అవసరమైన అన్ని మార్గాలను వాడుకుంటోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు (India-China Standoff) ఉన్న తరుణంలో చైనా దేశంలోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా (China's Snooping on VIPs) పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్‌కు చెందిన కీలక సంస్థలపై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టిందని జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనం వివరాల ప్రకారం...చైనా నిఘా నీడలో (China's Snooping on VIPs Amid Border Row) భారత రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, మాజీ సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన షేక్‌జేన్‌ అనే గూఢాచర సంస్థతో ఆ దేశ నిఘా విభాగం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు భారత్‌కు చెందిన ప్రముఖుల సమాచారాన్ని తస్కరించేందుకు మరికొన్ని రహస్య కంపెనీలతో చైనా నిఘా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఆర్మీ అధికారుల సమాచారాన్ని సైతం తెలుసుకునే విధంగా చైనా ఓ ప్రత్యేక విభాగాన్ని తయారుచేసిందని ఆ పత్రిక స్పష్టం చేసింది.

అమెరికాలో టిక్‌టాక్‌ కథకి ముగింపు? మైక్రోసాఫ్ట్‌కు బదులు ఒరాకిల్‌ పరం కానున్న టిక్‌టాక్‌, బైట్‌డ్యాన్స్‌తో చర్చలు సఫలం కాలేదని తెలిపిన మైక్రోసాఫ్ట్

సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలతో మొదలు దేశ రహస్యాలనే చేరవేసేందుకు కుట్రలు పన్నినట్లు పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సోనియా, రాహుల్‌ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జై శంకర్‌ల డేటాను చోరీ చేయాలని డ్రాగన్‌ వ్యూహరచన చేసినట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్, పంజాబ్ సిఎం కెప్టెన్ అమిరాందర్ సింగ్, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ కూడా ఉన్నారు.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన కథనం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తరుణంలోనే చైనా కుట్ర బయటపడటం కలకలం రేపుతోంది. చైనా దురాగతాలు, సరిహద్దుల్లో ఆక్రమణలపై పార్లమెంట్‌లో చర్చించాలని ఇదివరకే ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మార్చుకోకపోవడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కిడ్నాప్ చేసిన 5 మందిని భారత్‌కు అప్పగించిన చైనా, వెల్లడించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

భారత్ ప్రధాని, సైనికాధికారులు, ఇతర వీవీఐపీలపై చైనా గూఢచర్యానికి పాల్పడిందంటూ ఓ జాతీయ ఛానెల్ బయటపెట్టిన నేపథ్యంలో కేంద్రం తాజాగా స్పందించింది. ‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు’ అని సోమవారం నాడు కేంద్రం వ్యాఖ్యానించినట్లుగా మరో పత్రిక న్యూస్ 18 తెలిపింది. భారత నిఘా సంస్థలకు ఈ విషయంపై ముందుగానే సమాచారం ఉందని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ‘ఇటువంటి కారణాల రీత్యానేన చైనా యాప్‌లను నిషేధించాలనే నిర్ణయానికి వచ్చాము’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వ్యాఖ్యానించారు. ప్రధాని వంటి వీఐపీలకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సైతం భారత వ్యతిరేక కార్యకలాపాలకు శత్రు దేశాలు వినియోగించవచ్చని కథనంలో తెలిపారు.

ఇలా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శుత్రుదేశ నిఘా సంస్థలు తమకు కావాల్సిన వివరాల్లో 80 శాతం దాకా రాబట్టగలవని అధికారులు చెప్పారు. అదే సమయంలో.. ఈ వ్యవహారశైలి ప్రపంచ దేశాలకు మూమూలేనని కూడా వారు వ్యాఖ్యానించారు. ప్రతి దేశం.. ఇలాంటి సమాచారా విశ్లేషణ ద్వారానే ఇతర దేశాలపై ఓ కన్నేసి ఉంచుతుందన్నారు. అమెరికా అయితే సోషల్ మీడియా ద్వారా ఏకంగా 200 రకాల డాటా వివరాలను సేకరిస్తూ ఇతర దేశాలపై గట్టి నిఘా పెడుతుందన్నారు.