China-India border | (Photo Credits: PTI)

Itanagar, September 12: అపహరించిన ఐదుగురు భారతీయుల్ని (China Hands Over 5 Missing Men) చైనా ఆర్మీ శనివారం తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijjiju) ప్రకటించారు. నిర్దేశించిన ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు చైనా ఆర్మీ ఆ యువకులను భారత దళాలకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కిబితూ సరిహద్దుల్లో ఉన్న వాఛా ప్రదేశం దగ్గర భారత దళాలకు యువకులను అప్పగిస్తారని నిన్న మంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను సెప్టెంబర్ నాలుగో తేదీన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు అపహరించారు. అప్పర్ సుబన్ సిరి జిల్లాలోని నాచో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ దీనిపై పీఎంవోకు ఫిర్యాదు చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబన్‌సిరి జిల్లాలోని నాచో ప్రాంతానికి చెందిన కొందరు వేటగాళ్లు సరిహద్దు వెంబడి ఉన్న అడవుల్లో వేటకు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ఐదుగురిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అపహరించింది. తప్పించుకువచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయంలో తొలుత స్పందించని చైనా ఆర్మీ.. ఆ తర్వాత మాత్రం వారు తమ వద్దే ఉన్నారని అంగీకరించింది.

సరిహద్దుల్లో మానవత్వాన్ని చాటుకున్న భారత సైన్యం, 13 జడల బర్రెలు, 4 దూడలను చైనా సైన్యానికి అప్పగించిన భారత జవాన్లు, కృతజ్ఞతలు తెలిపిన చైనా అధికారులు

కాగా తమ రాష్ట్రంలోని (Arunachal Pradesh) సుబన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా ఆర్మీ అపహరించిందని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ ( Congress MLA Ninong Ering) ట్విటర్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఐదు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిందని ఎమ్మెల్యే ఎరింగ్‌ వెల్లడించారు. మార్చి 19న సుబన్‌సిరి జిల్లా ఎగువ ప్రాంతంలోని మెక్‌మోహన్‌ రేఖకు సమీపంలో 21 ఏళ్ల వ్యక్తిని చైనా ఆర్మీ అపహరిందని తెలిపారు.

సరిహద్దుల్లో అర్థరాత్రి కాల్పులు, భారత సైన్యమే కాల్పులు జరిపిందంటూ చైనా ఆరోపణలు, 5 మంది సంగతి మాకు తెలియదంటూ దాటవేత, చైనాతో యుద్ధంలో ఇండియా ఓడిపోతుందంటూ డ్రాగన్ మీడియా రాతలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైన్యం ఎలాంటి సమాచారం లేకుండా అపహరించిందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వారి జాడ ఇంతవరకు తెలియలేదన్నారు. ఈ మేరకు నిన్నాంగ్ ఎరింగ్ నేరుగా ప్రధాని కార్యాలయానికే ట్వీట్ చేశారు. ప్రధాని మంత్రి చొరవ తీసుకుని స్థానికులను విడిపించాలన్నారు.

5మందిని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ, ప్రధాని కార్యాలయానికి ట్వీట్ చేసిన అరుణాచల ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌, ఇంతవరకు జాడలేదని వెల్లడి

తాజాగా కిడ్నాప్‌నకు గురైన వారి వివరాలతో కూడిన స్క్రీన్‌ షాట్‌ను కూడా ఎమ్మెల్యే ఎరింగ్‌ షేర్‌ చేశారు. అయితే, ఈ ఘటన జరిగిందెప్పుడన్నది మాత్రం ఎమ్మెల్యే చెప్పలేదు. కిడ్నాప్‌ ఘటనపై చైనా స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని చెడగొట్టిన చైనా ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరంలోని భూభాగంలోకి చొరబడదామనుకున్న యత్నాలను భారత్‌ సమర్థంగా ఎదుర్కున్న సంగతి తెలిసిందే.