Congress MLA Ninong Ering (Photo Credits: Facebook)

Itanagar, September 5: భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ఐదుగురు స్థానికులను చైనా సైన్యం అపహరించిందంటూ (Chinese Army Abducted 5 People) అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ ( Congress MLA Ninong Ering) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని వెంటనే విడిపించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

తమ రాష్ట్రంలోని (Arunachal Pradesh) సుబన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా ఆర్మీ అపహరించిందని ఎమ్మెల్యే ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని అరుణాచల్‌ టైమ్స్‌ వార్తా సంస్థ కూడా ట్విటర్‌లో పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఐదు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిందని ఎమ్మెల్యే ఎరింగ్‌ వెల్లడించారు. మార్చి 19న సుబన్‌సిరి జిల్లా ఎగువ ప్రాంతంలోని మెక్‌మోహన్‌ రేఖకు సమీపంలో 21 ఏళ్ల వ్యక్తిని చైనా ఆర్మీ అపహరిందని తెలిపారు.

Here's MLA Tweet

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైన్యం ఎలాంటి సమాచారం లేకుండా అపహరించిందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వారి జాడ ఇంతవరకు తెలియలేదన్నారు. ఈ మేరకు నిన్నాంగ్ ఎరింగ్ నేరుగా ప్రధాని కార్యాలయానికే ట్వీట్ చేశారు. ప్రధాని మంత్రి చొరవ తీసుకుని స్థానికులను విడిపించాలన్నారు.

చైనా బలగాలు వెంటనే వెనక్కి వెళ్లాలి, శాంతి స్థాప‌న కోసం రెండు దేశాల మధ్య నిరంతరం చ‌ర్చ‌లు జరగాలి, మాస్కోలో ఎస్‌ఓసీ సమావేశంలో సరిహద్దు అంశాన్ని లేవనెత్తిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

తాజాగా కిడ్నాప్‌నకు గురైన వారి వివరాలతో కూడిన స్క్రీన్‌ షాట్‌ను కూడా ఎమ్మెల్యే ఎరింగ్‌ షేర్‌ చేశారు. అయితే, ఈ ఘటన జరిగిందెప్పుడన్నది మాత్రం ఎమ్మెల్యే చెప్పలేదు. కిడ్నాప్‌ ఘటనపై చైనా స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని చెడగొట్టిన చైనా ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరంలోని భూభాగంలోకి చొరబడదామనుకున్న యత్నాలను భారత్‌ సమర్థంగా ఎదుర్కున్న సంగతి తెలిసిందే.