Colombia: అమెరికాలో ఘోర ప్రమాదం, రహదారిపై వెళుతున్న బస్సును మింగేసిన బురద, 34 మంది మృతి, మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు

రహదారిపై వెళుతున్న బస్సుపై కొండచరియలు విరిగిపడడంతో 34 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

Representational Image (Photo Credits: ANI)

Colombia, Dec 6: అమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళుతున్న బస్సుపై కొండచరియలు విరిగిపడడంతో 34 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. మరో రెండు వాహనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి.భారీ వర్షాల కారణంగా కొండచరియలు బస్సుపై విరిగిపడటంతో బస్సు పూర్తిగా బురదలో మునగిపోయింది. రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

ఆందోళనకరంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం, చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని వార్తలు, తాజాగా మెట్ల మీద నుంచి జారిపడటంతో విరిగిపోయిన తుంటి ఎముక

సుమారు 70 మంది రెస్క్యూ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ప్రభుత్వ తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’ అని పేర్కొన్నారు.