Company Fires Employee For Sleeping At Work: పనిచేసే సమయంలో నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కి రూ.41.6 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి
అంతే, దీన్ని ఏదో తీవ్రమైన నేరంగా పరిగణించిన ఆ కంపెనీ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది.
Newdelhi, Nov 25: ఆఫీసులో (Office) అదేపనిగా వర్క్ (Work) చేయడంతో ఆ ఉద్యోగికి కాస్త అలసటొచ్చి రెప్ప వాల్చాడు. అంతే, దీన్ని ఏదో తీవ్రమైన నేరంగా పరిగణించిన ఆ కంపెనీ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. ఆ మాత్రానికే తొలగిస్తారా? అంటూ కోర్టుకెక్కిన ఉద్యోగికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలా అతడికి రూ.41.6 లక్షల పరిహారం దక్కింది. ఈ విచిత్రమైన ఘటన చైనా జియాంగ్షు ప్రావిన్స్ లోని టైజింగ్‌లో జరిగింది. ఝాంగ్ అనే వ్యక్తి ఓ కెమికల్ ఫ్యాక్టరీలో డిపార్ట్ మెంట్ మేనేజర్ గా 20 ఏండ్లుగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లో విధులకు వచ్చిన ఝాంగ్ డెస్క్ పై గంట పాటు కునుకు తీయడాన్ని సీసీటీవీలో చూసిన కంపెనీ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.
కంపెనీకి ఏమంత నష్టమేమీ కాదు
20 ఏండ్లుగా కంపెనీకి నమ్మకంగా పనిచేస్తున్న తనను తొలగించడం చట్టవిరుద్ధమని భావించిన ఝాంగ్ కంపెనీపై కోర్టుకెక్కాడు. కేసును విచారించిన టైజింగ్ పీపుల్స్ కోర్టు న్యాయమూర్తి.. అతడు తొలిసారి విధుల్లో నిద్రపోయాడని, ఆ కారణంగా కంపెనీకి తీవ్రమైన నష్టమేమీ వాటిల్లలేదన్నారు. ఉద్యోగం నుంచి అకారణంగా తొలగించినందుకు రూ. 41.6 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.