Coronavirus in US: అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు, న్యూయార్క్‌ను నాశనం చేస్తోన్న కరోనావైరస్, ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షలకు చేరువలో కోవిడ్ 19 కేసులు

ఇటలీ.. స్పెయిన్‌.. ఇలా ఒక్కో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు అమెరికాపై (America) అనూహ్యస్థాయిలో విరుచుకుపడుతున్నది. అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకు (Coronavirus Scare in US) విలవిలలాడుతోంది. అక్కడ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య నిన్నటికి లక్ష (1,01,000) దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 8 వేలే ఉండగా ఇప్పుడు లక్షను దాటేసింది. గురువారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 16,877 కొత్త కేసులు (COVID-19 Cases in US) నమోదయ్యాయి.

Coronavirus Global Report Nearly 1 lakh new corona cases in 24 hours globally, US leads (Photo-PTI)

New Delhi, March 28: చైనా.. ఇటలీ.. స్పెయిన్‌.. ఇలా ఒక్కో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు అమెరికాపై (America) అనూహ్యస్థాయిలో విరుచుకుపడుతున్నది. అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకు (Coronavirus Scare in US) విలవిలలాడుతోంది. అక్కడ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య నిన్నటికి లక్ష (1,01,000) దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 8 వేలే ఉండగా ఇప్పుడు లక్షను దాటేసింది. గురువారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 16,877 కొత్త కేసులు (COVID-19 Cases in US) నమోదయ్యాయి.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన కరోనావైరస్

అలాగే, ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ఇప్పటి వరకు 1588 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 402 మంది మృతి చెందారు. రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య మరింత పెరుగుతుందని, ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వం సిద్ధంకావాలని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో రెండు నెలల క్రితం తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ వైరస్ శరవేగంగా విస్తరించి ఇప్పుడు కరోనా బాధిత దేశంగా మారిపోయింది.ఇంకా చెప్పాలంటే కరోనా కేసుల్లో చైనా, ఇటలీలను అమెరికా దాటేసింది.

COVID -19 Global Report

న్యూయార్క్, వాషింగ్టన్‌లలో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. చికాగో, డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్‌లలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమ వద్ద తగినంత వైద్య వనరులు లేవని దేశవ్యాప్తంగా 213 నగరాల మేయర్లు చేతులెత్తేశారు. బాధితులను రక్షించేందుకు అవసరమైన పరికరాలను పొందే మార్గం కానీ, సరఫరా కానీ లేదని పేర్కొన్నట్టు శుక్రవారం విడుదలైన ఓ సర్వే వెల్లడించింది. న్యూ ఓర్లీన్స్‌లోని మూడు కరోనా పరీక్ష కేంద్రాల వద్ద అనుమానితులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

మిచిగన్‌లో వారం క్రితం 350గా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం 3 వేలకు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 468 మంది పోలీసులు అధికారులు క్వారంటైన్‌లో ఉన్నట్టు డెట్రాయిట్ మేయర్ మైక్ డగ్గన్ తెలిపారు. పోలీస్ చీఫ్ సహా 39 మంది పోలీసులు అధికారులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.

దక్షిణ కొరియా సాయం కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

న్యూయార్క్‌ నగరం (New York City) కరోనాకు కేంద్రస్థానంగా మరిందని కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ సమన్వయకర్త డెబ్రో బ్రిక్స్‌ పేర్కొన్నారు. కొత్త కేసుల్లో 55% అక్కడి నుంచే వస్తున్నాయన్నారు. ఆ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ ఉన్నదన్నారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో దాదాపు 19 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తొలిదశలో ఉందని ఆయన చెప్పారు.

కరోనావైరస్‌ను ఇండియా తరిమేస్తుంది

ఇదిలా ఉంటే కరోనాపై ఐక్యంగా పోరాడుదామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. అమెరికాతో మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నట్లు చెప్పారు. జిన్‌పింగ్‌తో చాలా మంచి సంభాషణ జరిగిందని, వైరను కట్టడిపై తాము చర్చించినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.

కరోనాపై ఇండియా ఘనవిజయం, 48 మంది పేషెంట్లు రికవరీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5.74 లక్షలకు చేరింది. అమెరికా మొదటిస్థానంలో ఉండగా.. చైనా 86,454 కేసులతో రెండోస్థానంలో నిలిచింది. ఇటలీలో 80,539 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 26,369కు పెరిగింది. ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 969 మంది మరణించారు. ఆ దేశంలో మరణాల సంఖ్య 8,015కు చేరుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్‌ (4,858), చైనా (3,292) నిలిచాయి. క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1, 21, 214 మంది కోలుకున్నారు.

ఇదిలా ఉండ‌గా అమెరికాలో క‌రోనా నివార‌ణ‌కు భారీ బ‌డ్జెట్ కేటాయించింది. రూ. 1,500 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు కేటాయిస్తూ ప్ర‌తిపాదించిన బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దీనికి ప్ర‌జాప్ర‌తినిధుల స‌భ ఆమోదం ఆమోదం తెలిపి..ట్రంప్ సంత‌కం చేస్తే అమల్లోకి వ‌స్తుంది. కాగా ఈ నిధుల‌ను మొత్తం కూడా ఆస్ప‌త్రుల నిర్మాణం, ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు వినియోగించ‌నున్నారు. అటు భార‌త్ కూడా క‌రోనా నివార‌ణ‌కు రూ 1.70ల‌క్ష‌ల కోట్లు కేటాయించింది.