Coronavirus in China: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, పలు ప్రావిన్సుల్లో లాక్‌డౌన్ అమల్లోకి, ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో నిర్మానుష్యంగా మారిన రోడ్లు, నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది
చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కొన్ని నగరప్రాంతాల్లో లాక్ డౌన్ (Covid Lockdown in China) విధించారు. సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ 18 వరకు కరోనా కేసులు (Coronavirus in China) అత్యధిక స్థాయిలో పెరిగాయి.
BEIJING, Oct 19: చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కొన్ని నగరప్రాంతాల్లో లాక్ డౌన్ (Covid Lockdown in China) విధించారు. సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ 18 వరకు కరోనా కేసులు (Coronavirus in China) అత్యధిక స్థాయిలో పెరిగాయి. కరోనా తీవ్రత అంతకంతకు పెరిగిపోతుండటంతో కఠిన ఆంక్షలు విధించారు. ఉత్తర సరిహద్దుకు దగ్గరలోని ప్రావిన్సుల్లో రెండు నగరాల్లో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దేశీయంగా కరోనావైరస్ వ్యాపించిన పలు నగరాల్లో ఇప్పటికే అధికారులు చాలామంది ఇన్ఫెక్షన్ సోకిన బాధితులను ట్రాక్ చేశారు. వారికి కరోనా టెస్టులు చేయిస్తున్నారు.
మంగోలియా, హువాన్, షాంగ్జీ ప్రావిన్సుల్లో లాక్‌డౌన్ (Two northern Chinese areas enforce lockdown) కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. Shaanxi ప్రావిన్స్ లోని నార్త్ వెస్టరన్ సిటీ Xian నగరంలో తొమ్మిదిమందికి పరీక్షలు చేయగా ఐదుగురికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అందులో మరో ఇద్దరు నార్తరన్ చైనీస్ రీజియన్ మంగోలియాకు చెందినవారు ఉన్నారు. విదేశాల నుండి వచ్చిన సోకిన ప్రయాణికులతో సహా అక్టోబర్ 18 న చైనాలో 25 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. అనంతరం మరో 19 కేసులు నమోదయ్యాయి.
నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) ప్రకారం.. ఇన్నర్ మంగోలియాలో 9వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే షాంగ్జీ, హునాన్ ప్రావిన్స్‌ల్లో రెండు కేసుల వరకు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన 25 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే 19 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. చైనా ప్రభుత్వం లెక్కల ప్రకారం.. ప్రస్తుతం అక్కడ ఎవరూ కరోనాతో మరణించలేదు. డాటా ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 4,636 కరోనా మరణాలు నమోదయ్యాయి. మెయిన్‌ల్యాండ్ చైనాలో 96,571 కరోనా కేసులు నమోదయ్యాయి.
దాదాపు 76 వేల జనాభా ఉన్న మంగోలియా ప్రాంతంలో 9 కేసులు రావడంతో అక్కడ ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్ విధించింది. రోడ్లపైకి ప్రజలను రాకుండా నిరోధిస్తుండటంతో నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. కరోనా కేసులు మరోసారి బయటపడటంతో మంగోలియా ప్రాంతంలో సినిమా హాళ్లు, ఇంటర్నెట్ కెఫెలు, జిమ్ వంటి ఇండోర్ పబ్లిక్ ప్రాంతాలను మూసిఉంచారు. అలాగే, పర్యాటక ప్రదేశాలను కూడా మూసివేశారు. మతపరమైన కార్యక్రమాలు చేపట్టకుండా నిషేధం విధించారు.
ఇన్నర్ మంగోలియాలో లాక్ డౌన్ విధించడంలో నిత్యవసర వస్తువులు కొరతతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Erenhot నగరంలో ఉండే 76వేల మంది నివాసితులకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అది కూడ అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని ఆదేశించారు. సమీప నగరాల్లో కూడా ప్రయాణ ఆంక్షలు విధించారు. ఒక నిత్యావసర రవాణా తప్పా అన్ని ఇతర ట్రావెల్ సర్వీసులన్నీ బంద్ చేసినట్టు Erenhot నగర యంత్రాంగం ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనా రాజధాని, బీజింగ్, మంగళవారం ఆగస్టు తర్వాత మొదటి స్థానిక కేసును నివేదించింది.
యిన్చువాన్‌లో వ్యాధి సోకిన వ్యక్తి రైలులో ప్రయాణించడం ద్వారా అతనికి వచ్చినట్లు గుర్తించారు. అనవసరమైన పర్యటనల కోసం పట్టణాన్ని విడిచి వెళ్లవద్దని యిన్చువాన్ నివాసితులకు ప్రభుత్వం సూచించింది. వైరస్ ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లోని బార్‌లు. సినిమాహాళ్లు వంటి బహిరంగ వేదికలను మూసివేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)