![](https://test1.latestly.com/wp-content/uploads/2021/10/Lieutenant-General-Manoj-Pande.jpg)
Rupa, Oct 19: భారత-చైనా సరిహద్దుల వెంట చైనా దళాలు గ్రామాలనే నిర్మిస్తున్నాయని ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే (Lt Gen Manoj Pande) తెలిపారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా ఆర్మీ ముందుకు దూసుకువస్తున్నట్లు (Chinese PLA Increases Exercises Along LAC) భారత ఆర్మీ పేర్కొన్నది. ఎల్ఏసీ వెంబడి ఉన్న కీలక, సమస్యాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ తన కార్యకలాపాలను పెంచినట్లు ఆయన తెలిపారు. ఆ ప్రాంతాల్లో వార్షిక సైనిక చర్యలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపడుతోందని తెలిపింది.
కీలక ప్రదేశాల్లో కార్యకలాపాల ఉదృతి పెరిగిందని, శిక్షణ పొందుతున్న ప్రదేశాల్లో ఇంకా పీఎల్ఏ దళాలు ఉన్నాయని, అందువల్లే వాస్తవాధీన రేఖతో పాటు డెప్త్ ఏరియాల్లో నిఘాను పెంచినట్లు లెఫ్టినెంట్ జనరల్ పాండే తెలిపారు. రెండు దేశాలకు చెందిన దళాలు.. వాస్తవాధీన రేఖ వెంట మౌళికసదుపాయాలను పెంచుకుంటున్నట్లు ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ వెల్లడించారు. పీఎల్ఏ వ్యూహాత్మక మోడల్ ప్రకారం.. బోర్డర్ వెంట వాళ్లు గ్రామాలను నిర్మిస్తున్నారని, అయితే అది ఆందోళనకరమైన అంశమని, ఈ విషయాన్ని తమ ప్రణాళికల్లోకి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
సరిహద్దుల్లో రక్షణ దళాల సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రతి సెక్టార్‌లో కావాల్సినంత దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ పాండే చెప్పారు. వీలైనంతవరకు టెక్నాలజీని పెంపొందించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తున్నట్లు ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ తెలిపారు.