Coronavirus in US: అమెరికాలో కరోనా మృత్యు ఘోష, నెలల పసికందును మింగేసిన కోవిడ్-19, లక్షా 21 వేలకు పైగా కరోనా కేసులు, రెండు వేలు దాటిన మృతులు సంఖ్య
ఆ దేశంలో కరోనా (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అమెరికాలో కోవిడ్ 19కు (COVID 19) ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్) శనివారం వెల్లడించింది.
New York, March 29: అగ్రరాజ్యం అమెరికా (America) కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆ దేశంలో కరోనా (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అమెరికాలో కోవిడ్ 19కు (COVID 19) ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్) శనివారం వెల్లడించింది.
దేశ ప్రజలను క్షమాపణ కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
ఈ ప్రాణాంతక వైరస్ మూలంగా అమెరికాలో ఇంతవరకు వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా మరణించగా.. పసివాళ్లు చనిపోవడం ఇదే తొలిసారి అని తెలిపింది. చిన్నారి మరణంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐడీపీహెచ్ డైరెక్టర్ ఎంగోజి ఎంజికె చెప్పారు. మెథనాల్ తాగి 400 మంది మృతి
కాగా కరోనా కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జకర్ తెలిపారు. చిన్నారి మరణం కలచివేసిందని ఆయన కన్నీటి వేదనతో అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
మహమ్మారి కరోనాతో చనిపోయిన వారి కుంటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రాణాంతక వైరస్‌తో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధానంగా వయసు మళ్లినవారికి ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు.
అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు
న్యూయార్క్ నగరంలో COVID-19 నుండి 517 మరణాలు నమోదయ్యాయి. న్యూయార్క్ రాష్ట్రంలో అక్కడక్కడా 100 మందికి పైగా మరణాలు సంభవించాయి. కింగ్ కౌంటీ (వాషింగ్టన్) లో 136 కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన కరోనావైరస్
యునైటెడ్ స్టేట్స్లో COVID-19 నుండి 960 మందికి పైగా కోలుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు కలిగిన దేశంగా ఉంది. ఇటలీ మరియు చైనా వరుసగా రెండవ మరియు మూడవ స్థానంలో ఉన్నాయి.
కరోనా కాటుకు బలైన స్పెయిన్ రాణి
ఇల్లినాయిస్‌లో మరణించిన వారిలో 85 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని తెలిపారు. కాగా, అమెరికా వ్యాప్తంగా లక్షా 20 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 2 వేల మరణాలు సంభవించాయి. ఇక ఇల్లినాయిస్‌లో 3491 కేసులు నమోదు కాగా 47 మంది మరణించారు. మరణాల పరంగా ఇటలీ, స్పెయిన్, చైనా తరువాతి స్థానంలో అమెరికా నిలిచింది.