IPL Auction 2025 Live

Coronavirus Outbreak: డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్, వైద్యం చేస్తూ డాక్టర్ మృతి, ఇప్పటికే చైనాలో 1300 కేసులు, 41 మంది మృతి, ఇండియాకు పాకిన కరోనా వైరస్

ఏకంగా వైద్యం చేస్తున్న డాక్టర్ల ప్రాణాలనే అటాక్ చేస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడంలో ముందంజలో ఉన్న చైనా హుబీ ప్రావిన్స్‌లోని ఒక సీనియర్ వైద్యుడు ఈ వైరస్ సోకి మరణించాడు.

Liang Wudong: first doctor to die from the new Coronavirus (Photo-Twitter)

Beijing, January 25: చైనాలోని (China) వుహాన్‌ పట్టణం (Wuhan) నుంచి విస్తరించిన కరోనావైరస్‌ (Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఏకంగా వైద్యం చేస్తున్న డాక్టర్ల ప్రాణాలనే అటాక్ చేస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడంలో ముందంజలో ఉన్న చైనా హుబీ ప్రావిన్స్‌లోని ఒక సీనియర్ వైద్యుడు ఈ వైరస్ సోకి మరణించాడు.

ఆయన మరణ వార్తను చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ ధృవీకరించింది. లియాంగ్ వుడాంగ్ గా గుర్తించబడిన ఈ వైద్యుడు వుహాన్ లోని హుబీ జిన్హువా ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేస్తున్నాడు.

ఇప్పుడు వుహాన్ ఈ కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారింది. ఈ జిల్లా నుండి కరోనావైరస్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. చైనా అంతటా ఇప్పటివరకు 1,300 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 41 కి చేరుకుంది, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ లో కూడా ప్రాణనష్టం సంభవించింది.

Breaking: Doctor Dies of Coronavirus in Wuhan

"గ్లోబల్ ఎమర్జెన్సీ" గా ప్రకటించబడే అంచున ఉన్న ఈ కరోనా వైరస్ (Corona virus) సంక్షోభాన్ని నియంత్రించడానికి చైనా ప్రభుత్వం (China Government) యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే 2002-03లో చైనాలో SARS (తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ వ్యాప్తికి సమాంతరంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి వుహాన్ మరియు హుబీ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న 13 ఇతర జిల్లాల్లో లాక్డౌన్ విధించబడింది. ఇంటి లోపల ఉండి, అవసరమైనప్పుడు మాత్రమే ఇళ్ల నుంచి బయటకురావాలని ప్రభుత్వం తెలిపింది. రోగుల ఆరోగ్యస్థితిని చెక్ చేసుకోవడనానికి, వారి ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది.

చనిపోయిన డాక్టర్ ఇతనే 

ఇక ఈ కరోనావైరస్ వ్యాప్తి యొక్క భయం భారతదేశానికి కూడా చేరుకుంది, ఇక్కడ తీవ్రమైన శ్వాసకోశ సిండ్రోమ్ యొక్క తేలికపాటి లక్షణాలను చూపించిన తరువాత చైనా నుండి తిరిగి వచ్చిన 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది. వారిలో నలుగురు సేఫ్ లో ఉండగా మరో 7 గురి పరిస్థితి ఇంకా తెలియడం లేదు. భారత్‌లోని కేరళకు చెందిన ఓ నర్సుకు కూడా ఈ వ్యాధి సోకినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో ఆ వైరస్‌ లక్షణాలు కనిపించలేదని డాక్టర్లు ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.

జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. మహమ్మారి ‘నావల్ కరోనా వైరస్‘ ఇండియాలోకి ప్రవేశించింది. తొలి పంజా మన ఆర్థిక రాజధాని ముంబైపై (Mumabi) విసిరింది. చైనా నుంచి ముంబై వచ్చిన ఇద్దరు వ్యక్తులకు వైరస్ సోకినట్లు గుర్తించామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శుక్రవారం ప్రకటించింది. ఆ ఇద్దరరి ప్రస్తుతం.. దక్షిణ ముంబై, చించ్పోకలిలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బీఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజా కేస్కర్ చెప్పారు.

Here's The Ministry of Health&Family Welfare Tweet

జనవరి 24 నాటికి, 96 విమానాల ద్వారా వచ్చిన 20,844 మంది ప్రయాణికులకు కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ చేశామని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఒక్కరోజే 19 విమానాలలో వచ్చిన 4082 మందిని పరీక్షించామని, ఇప్పటివరకు కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి కేసు నమోదుకాలేదని తెలిపింది. అయితే, ముగ్గురిని పరిశీలనలో ఉంచినట్టు తాజాగా ప్రకటించింది.

చైనాలో ఈ వైరస్‌ సోకిన వారు ఎక్కడి వారక్కడ ఉన్న ఫళంగా రోడ్ల మీద, బస్టాపుల్లో పడిపోతున్నారు. దాంతో భయకంపితులవుతున్న చైనీయులు తండోపతండాలుగా ఆస్పత్రులకు వెళుతున్నారు. వారి తాకిడిని తట్టుకోవడం వైద్యాధికారులకు తలకు మించిన భారమైంది.

ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రాయాలలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు

చైనాలోని మొత్తం 10 నగరాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. అంతేకాదు, చైనా గ్రేట్ వాల్‌ను సైతం మూసివేశారు. లూనార్ క్యాలెండర్ ప్రకారం చైనా కొత్త సంవత్సరం జనవరి 25 కాగా, ఇందుకు వారం రోజులు సెలవులు ఇస్తారు. అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకలను చైనీయులు జరుపుకుంటారు. కానీ, ఈసారి కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలను రద్దుచేశారు.

వుహాన్ పరిసర ప్రాంతాల్లోని నగరాల్లో ప్రజారవాణా, విమానాశ్రయాలను మూసివేశారు. బయటవారు లోపలికి ప్రవేశించకుండా, అక్కడవారు బయటకు వెళ్లకుండా టోల్ గేట్లను సైతం మూసివేసి, దిగ్బంధం చేశారు. మిలటరీ వైద్యులు సైతం రంగంలోకి దిగి సేవలను అందజేస్తున్నారు. చైనాలో తన కార్యాలయాలను పలు అంతర్జాతీయ సంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నాయి.



సంబంధిత వార్తలు

Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

Rajasthan: అంత్యక్రియల సమయంలో చితిమంటల మీద నుంచి లేచిన యువకుడు చికిత్స పొందుతూ మృతి, నలుగురి వైద్యులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Pakistan Suicide Attack: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 12 మంది సైనికులు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు, చెక్‌పోస్టు గోడపైకి దూసుకొచ్చిన పేలుడు వాహనం

Fire Accident in UP: ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)