COVID-19 in NYC: న్యూయార్క్‌లో కుప్పలు కుప్పలుగా కరోనా శవాలు, పూడ్చేందుకు చోటు లేకపోవడంతో సామూహిక ఖననం, కోవిడ్-19 దెబ్బకు న్యూయార్క్ సిటీలో 7067 మంది మృతి

కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా (America) అతలాకుతలం అవుతోంది. ఇక అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ (New York City) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఎక్కడ చూసినా శవాలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి, ఆస్పత్రుల్లో శవాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్‌ ( Bronx) సమీపంలోని ఓ ద్వీపం(Hart Island)లో సామూహిక ఖననం చేశారు.

New York City to begin burying coronavirus victims on Hart Island potters field (Photo-Twitter)

New York, April 10: కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా (America) అతలాకుతలం అవుతోంది. ఇక అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ (New York City) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఎక్కడ చూసినా శవాలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల్లో శవాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్‌ ( Bronx) సమీపంలోని ఓ ద్వీపం(Hart Island)లో సామూహిక ఖననం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీపై యూఎస్ ప్రెసిడెంట్ ప్రశంసలు

భారీగా కరోనా మృతదేహాలను (Coronavirus Deadbodys) తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారుగానీ ఎవరూలేకుండానే అంత్యక్రియలను నిర్వహించారు. ఇ‍ప్పటి వరకు న్యూయార్క్‌ (New York) నగరంలోనే దాదాపు 1 లక్షా 59 వేల మంది కరోనా బారిన పడగా దాదాపు 7067 మంది మృతిచెందారు.

Here's NYC workers burying bodies in a mass grave on Hart Island Video

ఇక అమెరికా వ్యాప్తంగా 4,68,703 మందికి కరోనా సోకగా, 16, 679 మంది మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షల మందికి కోరానా సోకగా, 95 వేల మంది మృతిచెందారు.అక్కడ కరోనా బాధితులు పెరిగిపోవడంతో మిలటరీ వైద్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి వచ్చింది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై వార్

2011లో న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కు చెందిన ట్విన్‌ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుచెందిన వారి సంఖ్యను ఒక్క న్యూయార్క్‌లో కరోనా మృతుల సంఖ్య దాటిపోయింది. 2011, సెంప్టెంబర్‌11 ఉగ్రదాడిలో మృతిచెందిన వారి సంఖ్య 2977 కాగా, ప్రస్తుతం అదే న్యూయార్క్‌ నగరంలో చోటుచేసుకున్న కరోనా మరణాలు రెట్టింపు కంటే అధికం అయ్యాయి.

హైడ్రా​క్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ ఎగుమతి చేయాలని ఇండియాను కోరిన అమెరికా

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఆసుపత్రి ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. మార్చురీలలో శవాలను పెట్టేందుకు ఖాళీ లేక ఆసుపత్రి బయటే శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. రోడ్ల పక్కనే చిన్న టెంట్లు ఏర్పాటు చేసి వాటిని మొబైల్ మార్చురీలుగా మార్చుతున్నారు' అని ఆసుపత్రి ఎదుటే నివాసముంటున్న అలిక్స్‌ మొంటెలీయోన్‌ తెలిపారు.

కోవిడ్ 19 ప్రభావిత దేశాలకు హైడ్రాక్సిక్లోరోక్విన్,పారాసిటమోల్‌ ఎగుమతి చేస్తామని తెలిపిన భారత్

రోజు రోజుకు కరోనావైరస్ కేసులు పెరిగిపోతుండటంతో ఇప్పటికే న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘దయచేసి న్యూయార్క్‌కు సహాయపడండి’’అని సాయం అర్థించారు. ‘‘ఇప్పటికే వేలమంది న్యూయార్క్‌ పౌరులను కోల్పోయాం. ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మేం విషాదంలో మునిగిపోయాం’’అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 10 లక్షల మంది హెల్త్‌ వర్కర్ల అవసరం ఉందని.. వారి సహాయంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కగలమని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now