Drugs. Image Used For Representational Purpose Only. (Photo Credits: Pixabay)

Mumbai, April 7: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారిపై పోరాడేందుకు ఒకే ఒక్క డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ (Hydroxychloroquine). వైరస్ సోకిన వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల వద్ద ఉన్న ఒకే ఒక్క ఉపాయం ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్, పారాసిటమోల్ (Paracetamol) మాత్రమే. మలేరియాకు వాడే మందును కరోనా చికిత్సలో వాడుతున్నారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై వార్, అమెరికాకు ఎగుమతి చేయకుంటే ఫలితాలు వేరేగా ఉంటాయన్న ట్రంప్

ఇండియా ఈ డ్రగ్స్ ఎగుమతిని ఇండియా ఆపేసింది. దీంతో కరోనా మహమ్మారిన పడి విలవిల లాడుతున్న ప్రపంచదేశాలు (Global) భారత్ వైపు చూస్తున్నాయి. ఆ డ్రగ్ ను ఎగుమతి చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ (India) కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రాణాంతక కరోనా వైరస్‌తో (COVID-19) అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఓ ప్రకటన విడుదల చేశారు.

హైడ్రా​క్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ ఎగుమతి చేయాలని ఇండియాను కోరిన అమెరికా

అంటువ్యాధి ప్రబలుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో పారాసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడిన పొరుగు దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేస్తాం. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాలకు కూడా సహాయం అందిస్తాం.

కోవిడ్-19 నియంత్రణకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధం వాడవచ్చా? 

ఇందులో రాజకీయాలకు ఎటువంటి తావులేదు. విపత్కర పరిస్థితుల్లో భారత్‌ అంతర్జాతీయ సమాజానికి సంఘీభావం తెలుపుతోంది. అన్ని దేశాలు పరస్పర సహాయసహకారాలు అందించుకోవాలి’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Check ANI tweet:

ఇదిలా ఉంటే భారత్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎగుమతి చేయకపోతే ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ వేదికగా మాట్లాడారు. వాణిజ్య పరంగా తమ నుంచి అనేక ప్రయోజనాలు పొందిన భారత్‌తో సత్పంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నానని సోమవారం నాటి సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత మందుల సరఫరాకు ససేమిరా అన్న భారత్‌.. మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.