Covid in China: చైనాలో కరోనా కల్లోలంపై షాకింగ్ రిపోర్ట్, డ్రాగన్ కంట్రీకి మూడ్ వేవ్‌ల ముప్పు, 10 లక్షలకుపైగా మరణాలు సంభవించే అవకాశం, చైనా నిపుణుల అధ్యయనంలో వెల్లడి

అత్యధికంగా కోవిడ్ కేసులు (Covid in China) నమోదవుతుండగా కరోనా మరణాలు భారీగా కూడా పెరుగుతున్నాయి. తాజాగా చైనీస్‌ ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ చీఫ్‌ ఎపిడమాలజిస్ట్‌ వూ జున్‌యూ ఓ నివేదికలో (Health expert predicts) సంచలన విషయాలు వెల్లడించారు.

COVID-19 in China. (Photo Credits: IANS)

Beijing, Dec 19: ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ ఇప్పుడు చైనాను గడగడలాడిస్తోంది. అత్యధికంగా కోవిడ్ కేసులు (Covid in China) నమోదవుతుండగా కరోనా మరణాలు భారీగా కూడా పెరుగుతున్నాయి. తాజాగా చైనీస్‌ ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ చీఫ్‌ ఎపిడమాలజిస్ట్‌ వూ జున్‌యూ ఓ నివేదికలో (Health expert predicts) సంచలన విషయాలు వెల్లడించారు. ఈ శీతాకాలంలో మెుత్తం 3 వేవ్‌లు ( three expected waves of Covid) వస్తాయని అందులో ఒకటి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

ప్రస్తుతం చైనాలో మెుదటి వేవ్‌ నడుస్తోందని, ఈనెల 15 నుంచి ప్రారంభమైన కొవిడ్‌ తొలివేవ్‌ జనవరి 15 వరకు కొనసాగుతుందన్నారు. ఇక రెండో వేవ్‌ జనవరి చివరి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుందని తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 21 నుంచి సెలవులు ప్రకటిస్తారు. ఈ సమయంలో లక్షల మంది ప్రయాణాలు చేయనుండడంతో కేసులు భారీగా పెరుగుతాయని జున్‌యూ అంచనా వేస్తున్నారు.

చైనాలో నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో 34,980 కొత్త కేసులు నమోదు, ఇప్పటివరకు 5233 మంది మృతి

ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 15 వరకు మూడో వేవ్‌ ఉంటుందని తెలిపారు. అది విహారయాత్రల నుంచి ప్రజలు తమ ఇళ్లకు చేరుకునే సమయం కాబట్టి అప్పుడూ కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు 2023లో కొవిడ్‌ కారణంగా చైనాలో 10 లక్షలకుపైగా మరణాలు సంభవిస్తాయని అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ నివేదిక వెల్లడించింది.

బీజింగ్‌లోని ఓ స్మశానవాటికలో గతంలో రోజుకు సుమారు 12 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగ్గా, ప్రస్తుతం 150 వరకు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి చైనాలో ఇప్పటివరకు 5,235 కరోనా మరణాలు సంభవించినట్టు ఆ దేశం చెప్తున్నది. వాస్తవంగా ఇంతకంటే చాలా ఎక్కువ మంది మరణించారనే వాదనలు ఉన్నాయి. జనవరి 22న చైనాలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. శీతాకాల సెలవులు ప్రారంభం కానున్నాయి. లక్షల మంది స్వంత గ్రామాలకు వెళ్లనున్నారు. దీంతో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

షాకింగ్ వీడియోలు, వారికి నిజంగానే జాంబీ వైరస్‌ సోకిందా, ఫిలడెల్ఫియాలో రోడ్లపై చిత్ర విచిత్రంగా నడుస్తున్న వీడియోలు వైరల్, డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు

పరిస్థితి ఇలాగే కొనసాగితే 2023 నాటికి కొవిడ్‌ మరణాల్లో చైనా కొత్త రికార్డు నెలకొల్పుతుందని అమెరికాకు చెందిన సంస్థ పేర్కొన్నది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి చైనాలో కొవిడ్‌ మరణాలు ఒక మిలియన్‌ (10 లక్షలు) దాటవచ్చని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది.

గత మూడేళ్లుగా జీరో-కొవిడ్‌ (Zero Covid) వ్యూహంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసిన చైనా.. ఇటీవలే ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా నగరాల్లో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ (Covid Test) పరీక్షలు లేకపోవడం, ఐసోలేషన్‌ (Isolation) నిబంధనలు, ప్రయాణాల ట్రాకింగ్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో చాలా నగరాల్లో వైరస్‌ (Coronavirus) విజృంభణ పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా నగరాలు నిర్మానుష్యంగా మారినట్లు తెలుస్తోంది.