చైనాలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. గురువారం 36,061 కేసులు నమోదు కాగా తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. అయితే కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇప్పటివరకు చైనా ప్రధాన భూభాగంలో కరోనా బాధితుల సంఖ్య 3,72,964కు చేరింది.కరోనా కేసులు పెరగడంతో బీజింగ్‌, షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్‌ వంటి ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)