Delta Covid-19 Variant: రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్, అమెరికాలో హైఅలర్ట్, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆ దేశ ఆరోగ్యశాఖ ఆదేశాలు, రెండు డోసులు తీసుకున్న వారిని సైతం వదలని డెల్టా
ఈ నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు (US tells vaccinated people) తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది. ఇండోర్స్‌లో ఉన్నవాళ్లు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని (Must mask again) సూచించింది.
New York, July 28: యుఎస్‌లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు (US tells vaccinated people) తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది. ఇండోర్స్‌లో ఉన్నవాళ్లు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని (Must mask again) సూచించింది. వ్యాక్సిన్లు ప్రభావంతంగా పనిచేస్తున్నా.. డెల్టా వేరియంట్ కేసులు అక్కడక్కడ పెరుగుతున్నాయని, అందుకే ఆ రిస్క్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని అంటువ్యాధి నిపుణుల డైరక్టర్ రోచెల్లి వాలెన్స్కీ తెలిపారు.
పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయిన వ్యక్తులు కూడా ఇండోర్ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాలని సీడీసీ సూచినట్లు రోచెల్లి చెప్పారు. ఇక అమెరికన్లు వ్యాక్సినేషన్ పట్ల శ్రద్ధ చూపాలని అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. సీడీసీ డేటా ప్రకారం.. దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో వైరస్ వ్యాప్తి (Delta Variant Spread) జరుగుతున్నట్లు గుర్తించారు. ఇక అత్యధికంగా టీకాలు తీస్తున్న ఈశాన్య ప్రాంతంలో వైరస్ ట్రాన్స్‌మిషన్ స్వల్ప స్థాయిలో ఉన్నట్లు తేల్చారు.
కరోనా డెల్టా వేరియంట్ (Delta Covid-19 Variant Spread) రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోందని గణాంకాలు, అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలోని కోవిడ్ వైరస్ వేరియంట్లన్నింటిలోకి డెల్టా వేరియంట్ వేగవంతమైన, ప్రభావవంతమైనదని, టీకా తీసుకోని వారిలో ఈ వేరియంట్ ప్రభావం అధికమని వార్తలు వెలువడుతున్నాయి.
టీకా రెండు డోసులు తీసుకున్నవారికి (vaccinated people) సైతం ఇన్‌ఫెక్షన్ కలిగించే సత్తా డెల్టాకు ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా టీకా తీసుకున్నా సరే డెల్టా సోకినవారు ఇతరులకు దీన్ని వ్యాప్తి చేయగలరని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టానే అని సైంటిస్టు షారన్ పీకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్‌ను ‘‘ఫిట్ అండ్ ఫాస్ట్’’గా అభివర్ణించారు. దీని దెబ్బకు టీకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పూర్తి చేసి ఆంక్షలు ఎత్తేసిన దేశాల్లో తిరిగి ఆంక్షలు విధించాల్సిన అవసరం వచ్చేలా ఉందన్నారు.
ఇప్పటివరకు కోవిడ్‌పై (Coronavirus)వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైనదని భావిస్తున్న ఫైజర్ టీకా డెల్టాపై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని ఇజ్రాయిల్‌లో బయటపడ్డ గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రిపాలైనవారిలో దాదాపు 22 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నవారున్నారు. సింగపూర్‌లో సైతం ఇదే రకమైన ధోరణి కనిపించింది. ఇజ్రాయిల్‌లో కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 60 శాతంమంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
యూఎస్‌లో నూతన ఇన్‌ఫెక్షన్లలో 83 శాతం డెల్టా వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈయూలోని మొత్తం 28 దేశాలుండగా, ప్రస్తుతం 19 దేశాల్లో డెల్టా జోరు పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఈసీడీసీ)సైతం ఇదే హెచ్చరికలు చేసింది. సాధారణ కోవిడ్ వేరియంట్లు సోకిన రోగి ముక్కులో ఉండే వైరల్ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్ సోకిన రోగి ముక్కులో వైరస్‌లోడు ఉంటుందని చైనాలో జరిపిన మరో అధ్యయనం వెల్లడించింది.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50 శాతానికి పడిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు యూకేలో జరిపిన ఈ పరిశోధన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలం గడిచేకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో, భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురుకావచ్చనే ఆందోళన వెల్లడవుతోంది. బూస్టర్ డోస్‌తో సానుకూల ఫలితం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరోనా సోకకుండా 93 శాతం రక్షణ కల్పిస్తుందని భారత్ పేర్కొంది. 98 శాతం మరణాలను తగ్గించినట్లు తాజా పరిశోధనలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో ఆర్మ్›్డ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై జరిగిన పరిశోధనలో ఈ మేరకు ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని అన్నారు.