New COVID-19 Variant B.1.621: వణికిస్తున్న మరో కొత్త వేరియంట్, బ్రిటన్‌లో 16 మందిలో B.1.621 రకం కరోనావైరస్, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో యూకేలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
Coronavirus in India (Photo-PTI)

London, July 26: కరోనా వైరస్‌కు చెందిన మరో కొత్త వేరియంట్‌ను బ్రిటన్‌లో గుర్తించారు. తాజాగా 16 మందిలో B.1.621 రకం వైరస్‌ను (New COVID-19 Variant B.1.621) గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త రకం వైరస్‌ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను (Found in UK With 16 Confirmed Cases) లండన్‌లోనే గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వేరియంట్ గురించి పెద్దగా తెలియదని చెప్పింది. టీకాలను ప్రభావితం చేసే లేదా మరింత తీవ్రమైన అనారోగ్యానికి ఇది దారితీయవచ్చని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. కరోనా కొత్త జాతి బ్రిటన్‌ ప్రజలలో ఎలాంటి భయాలను వ్యాప్తి చేయదని అన్నారు.

SARS-CoV-2కు చెందిన B.1.621 వేరియంట్ (New B.1.621 Variant) బ్రిటన్‌కు కొత్త వేరియంట్ కావచ్చని, అయితే ఇది ప్రపంచానికి కొత్తది కాదని ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ వేరియంట్‌ను కొలంబియాలో మొదట జనవరి నెలలో గుర్తించినట్లు వెల్లడించారు. విదేశీ ప్రయాణికులకే ఈ కొత్త వేరియంట్‌ సోకిందని, బ్రిటన్‌లో వ్యాప్తి చెందినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని వివరించారు. అంతర్జాతీయ ప్రయాణాల వల్లనే ఈ కేసులు బ్రిటన్‌లోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

భారత్‌లో తాజాగా 39,361 క‌రోనా కేసులు, ప్రస్తుతం దేశంలో 4,11,189 యాక్టివ్ కేసులు, కేరళలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

వైరస్ వ్యాప్తి, ప్రవర్తనను తెలుసుకునేందుకు లేబొరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇతరులకు వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దీని ప్రభావం తక్కువగా ఉన్నట్లు గుర్తించాం’’ అని బిట్రన్ ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా ఇప్పటి వరకూ అమెరికాలో - 592 కేసులు, పోర్చుగల్‌ - 56, జపాన్ - 47, స్విట్జర్లాండ్‌ - 41 కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. గత కొద్ది వారాలుగా బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా ఈ వారంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం ఆందోళన కలిగిస్తోంది.

తాజా నివేదికల ప్రకారం బ్రిటన్‌లో ఆర్ రేటు 1.2 నుంచి 1.4 శాతంగా ఉంది. దీని ప్రకారం కరోనా సోకిన వ్యక్తి వైరస్‌ను ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘వైరస్‌ గురించి భయపడుతూ ఉండేకంటే..దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలి’’ అని జావిద్‌ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనిపై జావెద్ క్షమాపణలు చెప్పారు. ‘‘ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడాలనేది నా ఉద్దేశం. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇందుకు నేను క్షమాపణలు చెబుతునున్నాను’’ అని జావిద్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.