US Election Results 2024 LIVE Updates: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన స్వింగ్ స్టేట్స్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నార్త్ కరోలినా తర్వాత రెండో స్వింగ్ స్టేట్ జార్జియాను వశం చేసుకోబోతున్నారు.2020 ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ పగా వేసింది. 2016 ఎన్నికల తరహాలోనే ట్రంప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
ఇది ట్రంప్‌కు విజేతను నిర్ణయించే కీలకమైన స్వింగ్ స్టేట్లలో రెండవది ఇది. అధ్యక్ష పదవిని గెలవడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లలో మొత్తం 246 ఓట్లకు మరో 16 ఎలక్టోరల్ ఓట్లను ఇస్తుంది.ట్రంప్ ఉత్తర కరోలినాను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా నాలుగు సంవత్సరాల క్రితం డెమొక్రాటిక్ విజయానికి కీలకమైన 2020లో అధ్యక్షుడు జో బిడెన్ రాష్ట్రాన్ని తీసుకున్న తర్వాత ట్రంప్ జార్జియాను మళ్లీ కైవసం చేసుకన్నట్లేనని తెలుస్తోంది. జార్జియా 1996 నుండి 2016 వరకు ప్రతి అధ్యక్ష రేసులో రిపబ్లికన్‌కు ఓటు వేసింది.
ఈ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్‌పై పట్టు బిగించింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి లభించాయి. మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ముందంజలో ఉంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల (US Election Results) ఆధారంగా డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా చేజారిపోయింది. తాజాగా రిపబ్లికన్లకు 51 మంది.. డెమోక్రట్లకు 42 మంది ఉన్నారు. మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.
ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, ఒకవేళ ఖాళీ అయితే సుప్రీంకోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించినట్లైంది. రానున్న సంవత్సరాల్లో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు రిటైర్ కానుండటంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఇక 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 247 సీట్లు లభించాయి. గతంతో పోలిస్తే ఒకటి ఎక్కువ. మరోవైపు డెమోక్రట్లు 234 స్థానాలు సాధించారు. దీంతో ఈసారి ట్రంప్ విజయం సాధిస్తే.. ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్దగా సమస్యలు ఎదురుకాని పరిస్థితి తలెత్తవచ్చు.
రిపబ్లికన్లు గెలుచుకున్న రాష్ట్రాలు..
కెంటకీ, ఇండియానా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఒక్లహోమా, మిస్సోరి, టెక్సస్, జార్జియా, ఇడాహో, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, అయోవా, సౌత్ డకోటా, లూసియానా, ఓహియో, వయోమింగ్, నెబ్రస్కా, టెనెస్సీ, అలబామా, మిసిసిపి, వెస్ట్ వర్జీనియా, అర్కన్సాస్, మోంటానా, యుటా,