Nobel for Ukraine President: ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి! యుక్రెయిన్ అధ్యక్షుడి పేరును ప్రతిపాదించిన యూరోపియన్ యూనియన్, జెలెన్ స్కీ కోసం నామినేషన్ తేదీ పొడిగించాలని డిమాండ్
జెలెన్స్కీ ఎంతగా శాంతిని కాంక్షిస్తున్నాడో అర్ధం చేసుకున్న ప్రపంచ దేశాలు ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలనీ భావించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పేరును 2022 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఇందుకోసం మార్చి 31 వరకు నామినేషన్ ప్రక్రియను పొడిగించాలని యూరప్ కు చెందిన పలువురు నేతలు నోబెల్ ప్రైజ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
Paris, March 18: రష్యాతో యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన యుక్రెయిన్ పై (Ukraine) ప్రపంచ దేశాలు సంఘీభావం తెలుపుతున్నాయి. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని యుక్రెయిన్ లో శాంతి స్థాపనకు తోడుగా నిలవాలంటూ ప్రపంచ దేశాలను చేతులెత్తిమొక్కుతున్న యుక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీపై (Zelenskyy) ప్రపంచ దేశాలు జాలి చూపిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు సర్వశక్తులొడ్డిన జెలెన్స్కీ(Zelenskyy).. యుద్ధాన్ని ఆపలేకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. జెలెన్స్కీ ఎంతగా శాంతిని కాంక్షిస్తున్నాడో అర్ధం చేసుకున్న ప్రపంచ దేశాలు ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) నామినేట్ చేయాలనీ భావించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ (Zelenskyy ) పేరును 2022 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఇందుకోసం మార్చి 31 వరకు నామినేషన్ ప్రక్రియను పొడిగించాలని యూరప్ కు చెందిన పలువురు నేతలు నోబెల్ ప్రైజ్ కమిటీకి (Nobel Prize Committee)విజ్ఞప్తి చేశారు.
2022 నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటికే 251 మంది పేర్లు నమోదు కాగా 92 శాంతి సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరియు ఆదేశ ప్రజల కోసం నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం లేదా నామినేషన్లను పునఃపరిశీలన చేయాలనీ యూరోపియన్ నాయకులు నోబెల్ కమిటీని కోరారు. ఈ ఏడాది నోబెల్ బహుమతిని అక్టోబరు 3 నుంచి 10వ తేదీల మధ్య ప్రకటించనున్నారు.మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 22 రోజుకు చేరుకుంది. రష్యా సేనలు యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలపై దాడి చేస్తున్నాయి.
ప్రజలు, ఆసుపత్రులు లక్ష్యంగా చేసుకుని రష్యా సైనికులు దాడులు చేస్తున్నట్టు UN భద్రతా మండలి సమావేశంలో అమెరికా, బ్రిటన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దాడుల నేపథ్యంలో ఇక్కడ నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు సరిహద్దులు దాటుకుంటూ పొరుగుదేశాలకు శరణార్థులుగా వెళుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి UN భద్రతా మండలి (UNSC) శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.