Hong Kong Suspends Flights: ఏప్రిల్ 20వ నుంచి మే 3 వరకు భారత్ నుంచి వెళ్లే విమానాలు రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న హాంకాంగ్ ప్రభుత్వం, ముంబై – హాంకాంగ్ మార్గంలో వెళ్లే విస్తారా విమానాలపై మే 3 వరకు నిషేధం
ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వరకు భారత్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ రద్దు (Hong Kong Suspends Flights) చేసింది. ఈ తేదీల్లో పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బయల్దేరే విమానాలపై కూడా నిషేధం విధించింది.
Hong Kong, April 19: భారత్‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వరకు భారత్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ రద్దు (Hong Kong Suspends Flights) చేసింది. ఈ తేదీల్లో పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బయల్దేరే విమానాలపై కూడా నిషేధం విధించింది.
భారత్‌నుంచి హాంకాంగ్ చేరుకున్న ప్రయాణికుల్లోనూ ముగ్గురికి వైరస్ నిర్థారణ అయింది. కాగా ఈ నెలలో రెండు విస్తారా విమానాల్లో ప్రయాణించిన 50 మంది ప్రయాణికులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన వెల్లడించింది. ముంబై – హాంకాంగ్ మార్గంలో వెళ్లే విస్తారా విమానాలను మే 3 వరకు నిషేధించింది.
ఆర్టీపీసీఆర్ ఫలితంలో 72గంటల ముందు నెగెటివ్ వస్తేనే ప్రయాణించాల్సి ఉంది. అంతకంటే ముందు ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాల్లోని ప్రయాణికులకు 47మంది వరకూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 6నుంచి ఏప్రిల్ 19వరకూ ఆ మార్గంలోని విమానాల రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే