Indian-Origin Malaysian Jailed: శాడిస్ట్ లవర్.. ప్రియురాలిపై పదే పదే దారుణంగా దాడి, ఏకంగా కత్తితో చంపేందుకు ప్రయత్నం, జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

న గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది.

Representative image

Singapore, June 23: భారతీయ సంతతికి చెందిన మలేషియన్‌కి (Indian Origin Malaysian) సింగపూర్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. న గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. తన సహోద్యోగురాలితో గత రెండు, మూడు సంవత్సారాలుగా పార్తిబన్‌ అనే మలేషియన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది.

ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్‌ ఎలిషా మాట్లాడుతూ...అతని ప్రవర్తన తీరు నచ్చాక అతనికి దూరంగా వచ్చేసి ఆమె తన మేనమామతో కలిసి ఉంటోంది. దీంతో అతను ఆమెను పదే పదే భయబ్రాంతులకు గురిచేస్తూ.. దాడి ( Terrorising His Girlfriend) ప్రారంభించాడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి కొట్టడంతో ఆమె మేనమామ కలగజేసకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. అయిన అతను వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాలేజీలో అందరి ముందు ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే, మాండ్య జేడీఎస్ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

బెయిల్‌ పై వచ్చి మళ్లీ ఆమె మేనమామ ప్లాట్‌ వద్దకు వచ్చాడు. ఐతే ఆమె నిరాకరిచడంతో గేట్‌ పగలుగొట్టి వచ్చి మరీ ఆమెను దారుణం హింసించి కారులో తీసుకుపోయేందకు యత్నించాడు. ఐతే ఆమె అక్కడ ఉండే స్థానికులను సాయంతో పోలీసులను రప్పించి అరెస్టు చేసింది. మళ్లీ బెయిల్‌ పై వచ్చి ఈ సారి ఏకంగా చంపేందుకు పథకం వేశాడు. కత్తితో బెదిరించి హింసించడం మొదలు పెట్టాడు.ఇక తట్టుకోలేక ఆమె చచ్చిపోదాం అనుకుంటుండగా...ఇంతలో ఒక పోలీస్‌ కారు అటువైపుగా వెళ్తుండటంతో ఆమె వారి సాయం కోరింది. దీంతో పార్తిబన్‌ వెంటనే అప్రమత్తమైన తప్పించుకునేందకు యత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాం‍డ్‌కి తరలించారు.

గెస్ట్ హౌస్‌లో పార్టీ అన్నారు..ఫ్రెండ్స్ కదా అని వెళితే మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు, కోలకతాలో టెకిపై సామూహిక అత్యాచారం

అతను విచారణలో అతనిపై మోపబడిన ఆరోపణలన్నింటిని అంగీకరించాడని చెప్పారు. ఇలా అతను తన ప్రేయసిని పదేపదే పైశాచికంగా హింసించి హత్య చేసేందుకు యత్నించినందుకు గానూ ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. ఐతే బాధితురాలి తరుపు న్యాయవాది ఆమెను గాయపరిచి, తీవ్రంగా హింసించినందుకుగానూ పార్తిబన్‌కి ఏడు నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష విధించాలని కోరడంతో అతనికి రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్షతో పాలు జరిమానా కూడా విధించే అవకాశం ఉందంటున్నారు అధికారులు.