తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే.. కళాశాల ప్రిన్సిపాల్‌ను కొట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యలో చోటుచేసుకుంది. కర్ణాటక మాండ్య నియోజకవర్గ ఎమ్మెల్యే, జేడీఎస్ పార్టీకి చెందిన ఎం.శ్రీనివాస్ మాండ్యలోని నల్వాడి కృష్ణ రాజా వడయార్ ఐటీఐ కళాశాలను ఈనెల 20న సందర్శించారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అక్కడ కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

ఈ క్రమంలో తన ప్రశ్నలకు ప్రిన్సిపాల్‌ నాగనాథ్ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోపం తెచ్చుకున్నారు. అంతే.. కళాశాల సిబ్బంది, ప్రజల ముందే సదరు ప్రిన్సిపాల్‌ను చెంప దెబ్బలు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలోని ఉద్యోగ సంఘాలు ఎమ్మెల్యేపైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)