Iraq Covid Hospital Fire: కరోనా ఆస్పత్రిలో ఒక్కసారిగా పేలిన ఆక్సిజన్ ట్యాంక్, 82 మంది అగ్నికి ఆహుతి, 110 మందికి గాయాలు, ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం

ఇరాక్ రాజధాని నగరంలోని Ibn Khatib ఆస్పత్రాలో ఒక్కసారిగా ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో (oxygen tank explodes) సుమారు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 110 మంది గాయపడ్డారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

Baghdad, April 25: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఆదివారం అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం (Iraq Covid Hospital Fire) సంభవించింది. ఇరాక్ రాజధాని నగరంలోని Ibn Khatib ఆస్పత్రాలో ఒక్కసారిగా ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో (oxygen tank explodes) సుమారు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 110 మంది గాయపడ్డారు.

ఇది కోవిడ్-19 వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం వినియోగిస్తున్న ఆసుపత్రి అని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Iraq's Interior Ministry) తెలిపింది. చనిపోయిన వారిలో కరోనావైరస్ యొక్క తీవ్రమైన లక్షణాలతో వెంటిలేటర్ల మీద పోరాడుతున్న కనీసం 28 మంది రోగులు ఉన్నారని మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి అలీ అల్-బయాటి ట్వీట్ చేశారు.

ఇరాక్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి ఖలీద్ అల్-ముహన్నా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాధిగ్రస్థులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో (Ibn Khatib hospital,) ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో పెను ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 82 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 110 మంది క్షతగాత్రులయ్యారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా నిరోధించేందుకు అన్ని ఆసుపత్రులను తనిఖీ చేస్తామని చెప్పారు.

ఇండియాలో కరోనా కల్లోలం..అండగా ఉంటామని తెలిపిన ప్రపంచ దేశాలు, భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటున్న డ‌బ్ల్యూహెచ్ఓ, భారత్‌కు అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందించ‌నున్న‌ట్లు తెలిపిన అమెరికా

ఈ ఘటనపై ఇరాక్ మానవ హక్కుల సెమీ అఫిషియల్ హై కమిషన్ సభ్యుడు అలీ మాట్లాడుతూ, మృతుల సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. మరోవైపు రోగుల బంధువులు ఆసుపత్రిలో వ్యాపిస్తున్న మంటల నుంచి తమ బంధువులను రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. కొందరు కిటికీల నుంచి బయటకు దూకారు. కొందరు రోగులు ఊపిరి ఆడకపోవడంతో మరణించే పరిస్థితిలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు.

ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మంటలను ఆర్పేసిన తర్వాత చాలా మంది తమ బంధువుల ఆచూకీ తెలియకపోవడంతో ఆసుపత్రి వద్ద వేచి చూశారు. ఈ అగ్ని ప్రమాదంపై దర్యాప్తునకు ఇరాక్ ప్రధాన మంత్రి ముస్తఫా అల్-కధిమి ఆదేశించారు. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిని గుర్తించే వరకు ఈ ఆసుపత్రి మేనేజర్, భద్రత, మెయింటెనెన్స్ విభాగాధిపతులను అరెస్టు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఈ ఫైర్ కు ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అధికారులను తొలగించాలని ఇరాక్ ప్రధాని (Prime Minister Mustafa al-Kadhimi) ఆదేశాలు జారీ చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif