Ismail Haniyeh Dead: హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను మేమే చంపాం, అంగీకరించిన ఇజ్రాయెల్
ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే
హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను (Ismail Haniyeh) హతమార్చింది తామేనని ఇజ్రాయెల్ (Israel) తాజాగా అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను చంపింది తామేనని ఇజ్రాయెల్ దేశ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు.
జర్మనీలో ఘోరం.. క్రిస్మస్ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు (వీడియో)
ఇటీవలి కాలంలో హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులు ప్రయోగిస్తున్నారని, వారికి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వడంలో భాగంగానే హమాస్, హెజ్బొల్లాలను ఓడించామన్నారు. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశామని, సిరియాలో బషర్ అల్ అసద్ పాలననను పడగొట్టామని తెలిపారు. హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చామని వెల్లడించారు. యెమెన్‌లోని హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదంటూ ఆయన హెచ్చరించారు.