Kolam: అమెరికాలో దుమ్మురేపిన కోలం, జో బైడెన్, కమలా హారీస్‌లకు భారతీయ సంప్రదాయ ముగ్గులు ద్వారా అభినందనలు, ఈ నెల 20న అధ్యక్షుడిగా జోబైడెన్, ఉపాధ్యక్షుడిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం

దీనికి ముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో (Joe Biden-Kamala Harris Inauguration Ceremony) భారతీయ కళారూపమైన కోలం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Kolam art. (Photo Credits: Twitter)

Washington, January 17: అమెరికా అధ్యక్షుడిగా న్నికైన జో బిడెన్ మరియు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కమలా హారిస్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. దీనికి ముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో (Joe Biden-Kamala Harris Inauguration Ceremony) భారతీయ కళారూపమైన కోలం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

వర్చువల్ వేడుకలో భాగంగా యుఎస్ వ్యాప్తంగా 1,800 మందికి పైగా వ్యక్తులు మరియు భారతదేశం నుండి చాలా మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. తమిళనాడు మూలాలు కలిగిన కమలాహారిస్ కు (Kamala Harris) అభినందనలు తెలుపుతూ స్వాగతానికి చిహ్నంగా ఉపయోగించే ముగ్గులను ఇంటి మందు వేసి అందరూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కోలంలు సానుకూల శక్తిని మరియు కొత్త ప్రారంభాలను సూచిస్తాయని చాలామంది నమ్ముతారు. పర్యావరణ అనుకూల పదార్థాలతో పలకలను రూపొందించడానికి వివిధ వర్గాల నుండి అన్ని వయసుల ప్రజలు తమ ఇళ్ల నుండి సహకరించారు. స్థానిక ప్రాజెక్టుగా ప్రారంభమైనా అది మా అంచనాలకు మించి వ్యాపించింది, ”అని మేరీల్యాండ్‌కు చెందిన అవార్డు గెలుచుకున్న మల్టీమీడియా మరియు మల్టీడిసిప్లినరీ ఆర్టిస్ట్ శాంతి చంద్రశేఖర్ అన్నారు.

డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి రెండోసారి ప్రతినిధుల సభ ఆమోదం, సెనేట్ ఆమోదం పొందటమే తరువాయి! బైడెన్ ప్రమాణస్వీకారం రోజున విధ్వంసాలు? ప్రశాంతంగా ఉండాలని ట్రంప్ పిలుపు

కొత్త పరిపాలనకు మంచి ప్రారంభానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఈ కోలాం నమూనాలను వైట్ హౌస్ ముందు ఉంచడం ప్రారంభ ఆలోచనగా చెప్పుకోవచ్చు.అయితే వాషింగ్టన్ డిసి పోలీసులు తరువాత ప్రారంభ వేదిక చుట్టూ కాకుండా కాపిటల్ హిల్ సమీపంలో ఉంచడానికి నిర్వాహకులకు అనుమతి ఇచ్చారు. వాషింగ్టన్ డిసిలో అపూర్వమైన భద్రతా చర్యల కారణంగా, అనుమతి రద్దు చేయబడింది.

ఫలితంగా, ‘అందరికీ ప్రెసిడెన్సీ’ స్ఫూర్తితో బిడెన్ ( Joe Biden) మరియు హారిస్‌లను స్వాగతించడానికి మరియు అమెరికా యొక్క బహుళ-సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి శనివారం వేలాది మంది కోలాం పలకల చిత్రాలతో స్వాగతం తెలిపారు.

వాషింగ్టన్ డిసి పబ్లిక్ స్కూల్స్ ఆర్ట్స్ డైరెక్టర్ మేరీ లాంబెర్ట్ మరియు విజువల్ ఆర్ట్స్ మేనేజర్ లిండ్సే వాన్స్ చంద్రశేఖర్‌తో కలిసి వివిధ నేపథ్యాలతో ప్రజలు రూపొందించిన వేలాది కోలాం డ్రాయింగ్‌లను కలిపి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ను స్వాగతించారు. ఈ నెల 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా వందలాది మంది కళాకారులు, పౌరులు మరియు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సహకరించి దీన్ని విజయవంతం చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ మీద షాకులు, తాజాగా యూట్యాబ్ ఛానల్‌పై వారం పాటు వేటు, హింసను ప్రేరేపించేలా కంటెంట్, ఇప్పటికే ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విచ్, రెడ్డిట్‌ అకౌంట్లపై నిషేధం

వాషింగ్టన్ డిసిలోని పది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కోలాం కళను రూపొందించడంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ మా విద్యార్థులకు మరొక సంస్కృతి గురించి మరియు కళలలో సృష్టికి అవసరమైన గణిత నైపుణ్యాల గురించి తెలుసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది" అని లాంబెర్ట్ చెప్పారు. "అలాగే, దృశ్య కళల ద్వారా వారి గుర్తింపును వ్యక్తీకరించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతరులతో ఐక్యతను చూడటానికి ఒక అవకాశమని అన్నారు.

జో బైడెన్ ప్ర‌భు్త్వంలో ఇండియ‌న్-అమెరిక‌న్‌ల‌దే హ‌వా. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన బాధ్య‌త‌ల‌ను 20 మంది ఇండియ‌న్‌-అమెరిక‌న్ల‌కే బైడెన్ అప్ప‌గించడం గ‌మ‌నార్హం. దేశ జ‌నాభాలో కేవ‌లం ఒక శాతంగా ఉన్న భార‌త సంత‌తి వ్య‌క్తుల‌కు ఇన్ని కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌డం ఇదే తొలిసారి. ఈ 20లో 17 వైట్‌హౌజ్‌లోనే కావ‌డం మ‌రో విశేషం. అమెరికా తొలి వైస్ ప్రెసిడెంట్‌గా ఓ మ‌హిళ (క‌మలా హారిస్‌) ప్రమాణం చేయ‌నుండ‌ట‌మే ఓ రికార్డు అయితే.. కొత్త ప్ర‌భుత్వంలో ఇంత‌మంది ఇండియ‌న్‌-అమెరిక‌న్లు ఉండ‌టం మ‌రో రికార్డు.

20 మందిలో 13 మంది మ‌హిళ‌లే కాగా ఇద్ద‌రికి చాలా శ‌క్తివంత‌మైన ప‌ద‌వులు ల‌భించాయి. అందులో ఒక‌రు నీరా టాండ‌న్‌. ఆమెను వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బ‌డ్జెట్‌కు డైరెక్ట‌ర్‌గా బైడెన్ నియ‌మించారు. ఇక డాక్ట‌ర్ వివేక్ మూర్తిని యూఎస్ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గా నామినేట్ చేశారు. ఇక వ‌నితా గుప్తాకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జ‌స్టిస్ అసోసియేట్ అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి ద‌క్కింది. ఫ‌స్ట్ లేడీ కాబోతున్న జిల్ బైడెన్‌కు పాల‌సీ డైరెక్ట‌ర్‌గా మాలా అడిగా.. ఫ‌స్ట్ లేడీ డిజిట‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ ద ఆఫీస్‌గా గ‌రిమా వ‌ర్మ‌, ఫ‌స్ట్ లేడీ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా స‌బ్రినా సింగ్‌ల‌ను బైడెన్ నియ‌మించారు.

జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా అధికారికంగా ధ్రువీకరించిన యూఎస్ కాంగ్రెస్, ఎట్టకేలకు తలవంచిన ట్రంప్.. అధికార బదిలీకి సుముఖత, జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం

తొలిసారి ఇండియ‌న్‌-అమెరిక‌న్ల‌లో ఇద్ద‌రు క‌శ్మీర్ మూలాలు ఉన్న వ్య‌క్తులు కూడా ప్ర‌భుత్వంలో చోటు సంపాదించారు. ఇందులో ఒక‌రు ఐషా షా. ఈమె వైట్ హౌజ్ డిజిట‌ల్ స్ట్రేట‌జీ ఆఫీస్‌లో పార్ట్‌న‌ర్‌షిప్ మేనేజ‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. మ‌రొక‌రు స‌మీరా ఫాజిలి. ఈమె యూఎస్ నేష‌న‌ల్ ఎక‌న‌మిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ)లో డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా ఉండ‌నున్నారు. ఇందులోనూ మ‌రో ఇండియ‌న్ అమెరిక‌న్ భ‌ర‌త్ రామ్మూర్తి కూడా డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా ఉంటారు. గ‌తంలో వైట్‌హౌజ్‌లో ప‌ని చేసిన గౌత‌మ్ రాఘ‌వ‌న్‌.. ఇప్పుడు ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.

ఏడాదిగా బైడెన్ శిబిరంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విన‌య్ రెడ్డికి డైరెక్ట‌ర్ స్పీచ్‌రైట‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. ఇక అధ్య‌క్షుడికి అసిస్టెంట్ ప్రెస్ సెక్ర‌ట‌రీగా యువ‌కుడైన వేదాంత్ ప‌టేల్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఎంతో కీల‌క‌మైన నేష‌న‌ల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ముగ్గురు ఇండియ‌న్ అమెరిక‌న్లు ఉన్నారు. త‌రుణ్ చాబ్రా, సుమోనా గుహ‌, శాంతి క‌ళాతిల్ ఇందులో కీల‌క‌మైన బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. భారత సంతతికి చెందిన వైద్య విధాన నిపుణులు విదుర్‌ శర్మకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. కొవిడ్‌-19 టెస్టింగ్‌ సలహాదారుగా ఆయనను నియమించారు. ఒబామా హయాంలోనూ ఆరోగ్య విధాన సలహాదారుగా విదుర్‌ శర్మ సేవలందించారు.

అమెరికా 46వ అధ్య‌క్షుడిగా జో బైడెన్‌ జనవరి 20న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఆయ‌న వ‌చ్చీ రాగానే ఇప్ప‌టి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆర్డ‌ర్ల‌న్నింటినీ వెన‌క్కి తీసుకోనున్నారు. తొలి రోజు ఆఫీస్‌లో పారిస్ ఒప్పందంలోకి తిరిగి చేర‌డం, ప‌లు ముస్లిం మెజార్టీ దేశాల ప్ర‌యాణికుల‌పై విధించిన నిషేధాన్ని ర‌ద్దు చేయ‌డంలాంటి కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఇవే కాదు తొలి రోజే ప‌దికిపైగా ఇలాంటి ట్రంప్ వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌న్నింటినీ రివ‌ర్స్ చేసే ఆలోచ‌న‌లో బైడెన్ ఉన్నట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్ వెల్ల‌డించారు. కొత్త అధ్య‌క్షుడి తొలి ప‌ది రోజుల యాక్ష‌న్ ప్లాన్‌కు సంబంధించి త‌న స్టాఫ్‌కు మెమో జారీ చేశారు.

అమెరికా ప్ర‌స్తుతం ప్ర‌ధానంగా నాలుగు సంక్షోభాల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు అందులో క్లెయిన్ పేర్కొన్నారు. అందులో మొద‌టిది కొవిడ్‌-19 సంక్షోభం, రెండోది దీని ద్వారా క‌లిగిన ఆర్థిక సంక్షోభం. మూడోది ప‌ర్యావ‌ర‌ణ సంక్షోభం, నాలుగోది వ‌ర్ణ వివ‌క్ష సంక్ష‌భ‌మ‌ని క్లెయిన్ అందులో చెప్పారు. ఈ నాలుగు సంక్షోభాల‌ను ఎదుర్కోవ‌డానికి త‌న తొలి ప‌ది రోజుల్లోనే బైడెన్ ప‌లు నిర్ణ‌యాత్మ‌క చ‌ర్య‌లు తీసుకుంటార‌ని, త‌ద్వారా ప్ర‌పంచంలో అమెరికా అగ్ర‌స్థానాన్ని మ‌ళ్లీ ప‌దిలం చేసే దిశ‌గా అడుగులు వేస్తార‌ని క్లెయిన్ వివ‌రించారు.

అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టాక తొలి 100 రోజుల్లో 10 కోట్ల మంది అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్‌ వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిగా విఫలమైందని చెప్పారు. ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఆయన తన ప్రణాళికను ఆవిష్కరించారు. మరింత మంది ప్రాధాన్య గ్రూపుల వారికి తక్షణమే వ్యాక్సిన్‌ చేరువ చేసేందుకు రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ ప్రమాణస్వీకారం రోజే.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రణాళికలు వేసే ఓ అధికారి పేర్కొన్నారు. బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ హాజరుకానున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న వాషింగ్టన్‌ వెలుపలు ఉన్న బేస్‌ ఆండ్రూస్‌ వద్ద ట్రంప్‌కు వీడ్కోలు పలుకబోతున్నట్లు తెలిపారు. వీడ్కోలు సమయంలో 21-గన్‌ సెల్యూట్‌ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారి చెప్పారు. అయితే ప్రణాళికల్లో మార్పులు ఉండవచ్చని చెప్పారు.

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్‌ హిల్‌ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచారు. అమెరికా సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అభిశంసన తీర్మానాన్ని సభ్యులు .. సెనెట్‌కు పంపనున్నారు. ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం డొనాల్డ్‌ ట్రంప్‌పై విచారణ జరగనుంది



సంబంధిత వార్తలు

President Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ కోసం టోల్ ఫ్రీ నెంబర్...!

Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్