Kuwait Building Fire: పొట్టకూటి కోసం కువైట్ వెళ్ళి మాంసపు ముద్దలైన 41 మంది భారతీయులు, అగ్నిప్రమాదంలో గుర్తుపట్టే వీలులేకుండా సజీవదహనమై..
ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందారు. వీరిలో 41 మంది భారతీయులే (Indians) కావడం మరింత విషాదకరం.
Kuwait, June 12: కువైట్ (Kuwait)లో ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందారు. వీరిలో 41 మంది భారతీయులే (Indians) కావడం మరింత విషాదకరం. జీవనోపాధి కోసం సొంతవాళ్లకు దూరంగా వచ్చి ఓ కంపెనీలో పనిచేస్తున్న వీరంతా ఇలా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 25 మంది కేరళ వాసులేనని తెలుస్తోంది. కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 5 గురు భారతీయులతో సహా 40 మంది మృతి, మంగాఫ్ నగరంలోని అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు
దక్షిణ మంగాఫ్ నగరంలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం (Fire Accident) జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో భవనంలో 160 మంది ఉన్నారు. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. తొలుత కిచన్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అందులో నివసిస్తున్న వారు బయటకు వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది
Here's Videos
ఈ ఘటనలో 44 మంది మంటల్లో కాలి సజీవదహనమవ్వగా.. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 40 మంది భారతీయులేనని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మంది భారతీయులే. ఘటన జరిగిన భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని చాలా మంది నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.