Israel's Strikes in Lebanon: లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు, 182 మంది మృతి, మరో 727 మందికి గాయాలు
తాజాగా భీకర వైమానిక దాడులు (Israel's Strikes in Lebanon) నిర్వహించింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది స్థావరాలపై విరుచుకుపడింది.
లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇటీవలే పేజర్స్, వాకీ టాకీలను పేల్చివేసిన ఇజ్రాయెల్... తాజాగా భీకర వైమానిక దాడులు (Israel's Strikes in Lebanon) నిర్వహించింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది స్థావరాలపై విరుచుకుపడింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడుల్లో కనీసం 182 మంది మరణించారని (Israeli airstrikes kill at least 182), 727 గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
లెబనాన్‌లో దాడులపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ స్పందించారు. ‘‘లెబనాన్‌లో మా దాడులను తీవ్రతరం చేస్తున్నాం. మా దేశ ఉత్తర భూభాగంలోని ప్రజలు వారి ఇళ్లలో ప్రశాంతంగా నివసించాలనే మా లక్ష్యం నెరవేరే వరకు మా చర్యలు కొనసాగుతాయి’’ అని స్పష్టం చేశారు. లెబనాన్‌లో వైమానిక దాడుల అనంతరం సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఇ
రాన్ మద్దతు ఉన్న లెబనాన్‌లో దక్షిణం, తూర్పు బెకా లోయతో పాటు సిరియాకు సమీపంలో ఉండే ఉత్తర ప్రాంతంలో కూడా దాడులు చేశామని పేర్కొన్నారు. కాగా, గతేడాది ఇజ్రాయెల్‌లో నరమేధం సృష్టించిన హమాస్‌కు హిజ్బుల్లా మద్దతిస్తోంది. పలుమార్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి రాకెట్‌లను ప్రయోగించింది. అందుకే హిజ్జుల్లా స్థావరాలను దెబ్బతీయడంపై ఇజ్రాయెల్ దృష్టిసారించింది.