లెబనాన్ లోని హిజ్బొల్లా లక్ష్యంగా గురువారం ఇజ్రాయెల్ మిలటరీ రాకెట్లతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బొల్లాకు చెందిన పలు స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న 150 లాంచర్ బ్యారెల్స్, మిలటరీ మౌలిక సదుపాయాలు, భవనాలు, ఆయుధ గోడౌన్లను నాశనం చేసింది. కాగా ఈ ఏడాది ఇంత తీవ్రంగా దాడిచేయడం ఇదే తొలిసారి.

ఇజ్రాయెల్ దాడిలో పెద్ద లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలు పెద్ద ఎత్తున తగలబడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలు పేలిన నేపథ్యంలో ప్రతికారం తప్పదని హిజ్బొల్లానేత హసన్ నస్రుల్లా హెచ్చరికలు జారీచేసిన వెంటనే ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేయడం గమనార్హం.

పేజర్లే కాదు పేలిన వాకీటాకీలు, ల్యాండ్ ఫోన్లు, వరుస పేలుళ్లతో లెబనాన్‌లో యుద్ధమేఘాలు, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హిజ్బుల్లా హెచ్చరిక

హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తొలిసారి దక్షిణ ఇజ్రాయెల్‌ వాసులకు ఆంక్షలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, రక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)