20 killed in Lebanon walkie-talkie explosions,Israel PM issues statement

Hyd, Sep 19: లెబనాన్‌లో వరుస పేలుళ్లతో కలకలం చోటు చేసుకుంది. మంగళవారం ;పేజర్ల పేలుళ్ల సంఘటన మర్చిపోకముందే మరోసారి వాకీటాకీలు, ల్యాండ్ ఫోన్లు పేలి 14 మంది మృతిచెందారు. పేజర్ పేలుళ్లల్లో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనల్లో 14 మంది మృతి చెందారని, 450 మంది గాయపడ్డారని తెలిపింది.

మొత్తంగా 20 మందికి పైగా పేజర్ పేలుళ్ల ఘటనలో చనిపోగా 3 వేల మందికి పైగా గాయపడ్డారు. వాకీటాకీలతో ల్యాండ్ ఫోన్లు కూడా పేలిపోవడం విశేషం. మంగళవారం ఒక్కసారిగా వేలాది పేజర్లు పేలగా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఇక ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ మొసాద్ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం పేలిపోయిన వాకీటాకీలను దాదాపు ఐదు నెలల కిందటే కొనుగోలు చేసినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. వీటిని కూడా మంగళవారం పేలిపోయిన పేజర్ల కొన్నప్పుడే హెజ్బొల్లా ఆర్డర్ ఇచ్చింది. వరుస పేలుళ్లతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడికి హెజ్బొల్లా సిద్ధమవుతోంది.  లెబనాన్‌లో పేలిన పేజర్లు, 9 మంది మృతి..2800 మందికి పైగా గాయాలు, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా ప్రకటన 

లెబనాన్లోని పలు ప్రాంతాల్లో హిజ్బుల్లాహ్ మిలిటెంట్ గ్రూప్ చేతితో పట్టుకునే రేడియోలు లేదా వాకీ టాకీలు పేలడంతో కనీసం 20 మంది మరణించారు మరియు 450 మందికి పైగా గాయపడ్డారు. సమూహం తన సభ్యుల మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పేజర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసిందని అనుమానించిన ఒక రోజు తర్వాత ఈ అత్యంత అధునాతన దాడి జరిగింది.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం మాట్లాడుతూ..తమ దేశ ప్రజలను కాపాడుకోవడమే తమ ముందున్న లక్ష్యమని..ఉత్తరాది నివాసితులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి పంపుతామి తెలిపారు. ఇక ఈ పేలుళ్లలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారి తీవ్రంగా గాయపడ్డారు . మరోవైపు పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లాల మధ్య యుద్ధాన్ని నివారించడానికి చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.