Hyd, Sep 18: లెబనాన్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లా సంస్థ సభ్యులు వాడుతున్న పేజర్లు పేలాయి. లెబనాన్ దేశ వ్యాప్తంగా పలు చోట్ల పేలుళ్లు సంభవించగా ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందగా 2800 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉండడంతో హిజ్బుల్లా సభ్యులు సమాచారాన్ని బదిలీ చేసుకోవడానికి పేజర్లు వాడుతున్నారు. ఇజ్రాయెల్ సైబర్ దాడి చేసి పేజర్లలోని లిథియం బ్యాటరీలను వేడెక్కేలా చేసి ఉండొచ్చని హిజ్బుల్లా సంస్థ అనుమానిస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనకు కారణమైన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా సంస్థ ప్రకటించింది. గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌తో చైనా విలవిల, ఆర్థిక నగరం షాంఘై అస్తవ్యస్తం, రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
అయితే ఈ పేలుళ్లపై ఇజ్రాయెల్ స్పందించ లేదు. కానీ ఈ ఘటన జరగడానికి ముందు తమ దేశ ఉత్తర భాగంలో హిజ్బుల్లా సభ్యుల దాడులను ఆపడమే లక్ష్యంగా పనిచేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతుండగా ఇదే సమయంలో ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో తరుచూ కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.