Aung San Suu Kyi Jailed: అంగ్‌ సాన్ సూకీకి నాలుగేళ్లు జైలు శిక్ష, అన్ని కేసులు రుజువైతే వందేళ్లు శిక్ష పడే అవకాశం

మిలిట‌రీ(military )కి వ్యతిరేకంగా అస‌మ్మతిని రెచ్చగొట్టడం, స‌హ‌జ విప‌త్తుల చ‌ట్టంలోని కొవిడ్ నియ‌మాల‌ ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది అక్కడి న్యాయస్థానం.

Myanmar December 06: మయిన్మార్‌(Myanmar)కు చెందిన బహిష్కృత నేత అంగ్‌ సాన్ సూకీకి (Aung San Suu Kyi)  నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. మిలిట‌రీ(military )కి వ్యతిరేకంగా అస‌మ్మతిని రెచ్చగొట్టడం, స‌హ‌జ విప‌త్తుల చ‌ట్టంలోని కొవిడ్ నియ‌మాల‌ ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది అక్కడి న్యాయస్థానం.  మిలిట‌రీ(military ) ప్రభుత్వం అంగ్‌సాన్ సూకీపై మొత్తం 11 కేసులు  పెట్టింది. అయితే ఆ అభియోగాల‌న్ని అబ‌ద్దాల‌ని అంగ్‌సాన్ సూకీ (Aung San Suu Kyi) కొట్టిపారేశారు.

గ‌త ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అంగ్‌సాన్ సూకీ సూకీ (Aung San Suu Kyi) నేతృత్వంలోని NLD పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. కానీ ఆ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ గ‌త ఫిబ్రవ‌రిలో మిలిట‌రీ సైనిక తిరుగుబాటు చేసి పౌర ప్రభుత్వాన్ని కూల్చేసింది. అప్పటి నుంచి సూకీకి గృహ నిర్బంధం విధించారు. అమెపై ర‌క‌ర‌కాల అవినీతి అభియోగాలు మోపారు. కాగా, అమెపై న‌మోదైన అన్ని అభియోగాల్లో దోషిగా తేలితే సూకీకి వందేండ్లకు పైగా శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్నది.

Myanmar Political Crisis: సైన్యం అదుపులో మయన్మార్, ఆంగ్‌ సాన్‌‌ సూకీని బంధించిన మిలటరీ సైన్యం, ఆది నుంచి అక్కడ ఏం జరిగింది? సూకీని ఎందుకు బంధించారు. మయన్మార్ రాజకీయ సంక్షోభంపై ప్రత్యేక కథనం

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచింది. అక్కడ సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు నిరసనలతో హోరెత్తుతుండగా ఆంగ్‌ సాన్‌కి జైలు శిక్ష విధించడం మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.