Russia-Ukraine Conflict: న్యూక్లియర్ వార్‌ కు దిగుతున్న రష్యా, మరో న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ స్వాధీనం దిశగా దూసుకెళ్తున్న బలగాలు, రష్యా దూకుడుతో ఐక్యరాజ్యసమితి ఆందోళన

రష్యా బలగాలపై యుక్రెయిన్ సైన్యం ఎంతగా ప్రతిఘటించినా వెనక్కి తగ్గడం లేదు. పుతిన్ బలగాలు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. యుక్రెయిన్‌పై క్రమంగా రష్యా బలగాలు పట్టుబిగిస్తున్నాయి.

Russian-Army

Kyiv, March 05: రష్యా గుప్పిట్లో యుక్రెయిన్ (Ukraine) వణికిపోతోంది. రష్యా బలగాలపై యుక్రెయిన్ సైన్యం ఎంతగా ప్రతిఘటించినా వెనక్కి తగ్గడం లేదు. పుతిన్ బలగాలు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. యుక్రెయిన్‌పై క్రమంగా రష్యా బలగాలు పట్టుబిగిస్తున్నాయి. ఒకవైపు రష్యా దాడులకు తెగబడుతూనే మరోవైపు యుక్రెయిన్ ప్రధాన నగరాలు, న్యూక్లియర్ ప్లాంట్లను (nuclear plant) లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది రష్యా(Russia).. ఇప్పటికే యుక్రెయిన్ యూరప్ అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై కాల్పులు జరిపిన రష్యా.. మరో అణు విద్యుత్ కేంద్రంపై(nuclearp power plant) కన్నేసింది. యుక్రెయిన్‌లోని మైకలేవ్ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ పైనే రష్యా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా రష్యా బలగాలు చొచ్చుకుని వస్తున్నట్టు కనిపిస్తోంది.

Topless Protesters Against Putin:పుతిన్ కు వ్యతిరేకంగా దుస్తులు విప్పేసిన మహిళలు, రష్యా ఎంబసీ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన స్పెయిన్ మహిళా సంఘాలు

రష్యా అణు విద్యుత్ ప్లాంట్లను స్వాధీనం చేసుకోవడంపై ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి (UNO) కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అణు విద్యుత్ ప్లాంట్లపై దాడులకు పాల్పడితే ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అతిప్రమాదకరమైన విపత్తు పొంచి ఉందని అంటోంది. ఇప్పటికే సిటీలోకి దూసుకొచ్చిన రష్యా బలగాలు పోర్టు సిటీ, మరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. రష్యా బలగాలను అడ్డుకునేందుకు యుక్రెయిన్ సైన్యం కూడా ఎదురుదాడులకు దిగుతోంది.

అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే.. వినాశనమే అనే విషయం తెలిసినప్పటికీ.. రష్యా ఆ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకిత్తిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలైన అణు విద్యుత్ కేంద్రాలను రష్యా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అణు విద్యుత్ ప్రాంతాల్లోనూ రష్యా రాకెట్లతో దాడి చేస్తోంది. యుక్రెయిన్‌లోని యూరప్‌ అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జప్రోజహియ(Zaporizhzhia ) న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా రాకెట్లతో దాడులు చేసింది. ఈ దాడులతో అణు విద్యుత్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. పొరపాటున ఈ అణు ప్లాంట్ పేలితో భారీ వినాశనం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడి ఘటనతో యుక్రెయిన్‌లో అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై మరింత ఆందోళనను రేకిత్తిస్తోంది.

Zaporizhzhia Nuclear Power Plant: యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

రష్యా దాడుల్లో అణు విద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ ఘటన పునరావృతం అవుతుందనే ఆందోళన ఎక్కువుతోంది. వాస్తవానికి ఈ అణు రియాకర్లు ఎన్నో ఏళ్ల క్రితమే ఇక్కడ నిర్మించారు. యుక్రెయిన్‌ కూడా వాటి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. యుక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరుతున్నారు. నో ఫ్లైజోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది. అలా చేస్తే.. ఐరోపాలో పెను యుద్ధానికి దారితీస్తుందన్న నాటో హెచ్చరిస్తోంది.