Spain, March 05: యుక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) యుద్ధం కొనసాగుతోంది. వారానికి పైగా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. దీనిపై అనేక దేశాల్లో నిరసనలు వస్తున్నాయి. పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా రష్యాతో పాటూ పలు దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని యావత్ ప్రపంచం తప్పుపడుతోంది. పుతిన్ వెంటనే యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా, పుతిన్ (Putin) వినడం లేదు. వెనక్కితగ్గడం లేదు. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. తాజాగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ (Madrid) లో ఫెమెన్ అనే మహిళా సంఘం వాలంటీర్లుtopless demonstrations (feminist group) రష్యా ఎంబసీ ముందు అర్దనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు.

UN Resolution: ఉక్రెయిన్ పై యుద్ధం ఆపండి! ఐక్యరాజ్యసమితి చారిత్రాక ఓటింగ్, రష్యాకు వ్యతిరేకంగా భారీగా ఓట్లు, ఓటింగ్ కు దూరంగా భారత్ సహా 35 దేశాలు

తమ పై దుస్తులు విప్పేసి(topless demonstrations) నిరసన తెలిపారు. వారు తమ ఛాతిపై ‘పుతిన్ యుద్ధాన్ని ఆపు’(Stop Putin war) అనే నినాదాలు రాసుకున్నారు. గతంలో సెక్స్ టూరిజంకు వ్యతిరేకంగా ఈ వాలంటీర్లు ఇదే తరహా నిరసన తెలియజేశారు. రష్యా- యుక్రెయిన్ మ‌ధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా సేనలు యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ప‌లు కీల‌క న‌గ‌రాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి.

Zaporizhzhia Nuclear Power Plant: యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

అంతేకాకుండా యూర‌ప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్ర‌మైన జ‌పోరిజియాపై ర‌ష్యా సేనలు దాడుల‌కు దిగాయి. ఈ దాడిలో జ‌పోరిజియా ప్లాంట్ ప్ర‌మాదానికి గురైంది. ఫైరింగ్ వ‌ల్ల ఆ ప్లాంట్‌లో మంట‌లు వ్యాపించాయి. అయితే ఆ మంట‌లను ఫైర్‌ఫైట‌ర్స్ ఆపారు. న్యూక్లియ‌ర్ ప్లాంట్‌లో ఉన్న ప‌వ‌ర్ యూనిట్ల‌ను అక్క‌డే ఉన్న సిబ్బంది మానిట‌ర్ చేస్తున్నార‌ని స్థానికులు తెలిపారు. ప్లాంట్ దాడిలో రియాక్ట‌ర్ నెంబ‌ర్ వ‌న్‌లో స్వ‌ల్పంగా డ్యామేజ్ జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.