Pakistan SC Slams Imran Khan Govt: పాక్ ప్రధానికి పాలించే సామర్థ్యం లేదు, దేశాన్ని పాలించే పద్ధతి ఇది కాదు, సీసీఐ సమావేశం ఆలస్యంపై ఇమ్రాన్ సర్కారుపై మండిపడిన ఆ దేశ సుప్రీంకోర్టు
ఈ విషయం మీద పాకిస్తాన్ ప్రధానిపై ఆ దేశ సుప్రీంకోర్టు ఆగ్రహం (Pakistan SC Slams Imran Khan Govt) వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌కు దేశాన్ని పాలించడం రావడంలేదని (Incapable of Running Country) ఆక్షేపించింది.
Islamabad, March 16: గత రెండు నెలలుగా కామన్ ఇంటరెస్ట్ కౌన్సిల్ (సీసీఐ) సమావేశం ఏర్పాటు చేయడంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విఫలం అవుతూ వస్తున్నారు. ఈ విషయం మీద పాకిస్తాన్ ప్రధానిపై ఆ దేశ సుప్రీంకోర్టు ఆగ్రహం (Pakistan SC Slams Imran Khan Govt) వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌కు దేశాన్ని పాలించడం రావడంలేదని (Incapable of Running Country) ఆక్షేపించింది. దేశాన్ని పాలించే పద్ధతి ఇది కాదంటూ మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Pakistan Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇద్దరు సభ్యుల బెంచ్‌కు జస్టిస్ ఖాజీ ఫేజ్ ఇసా నాయకత్వం వహించారు.
దేశాన్ని నడిపించడానికి జనాభా గణన ప్రాథమిక అవసరమని నొక్కిచెప్పిన జస్టిస్ ఇసా.. ‘జనాభా లెక్కల ఫలితాలను విడుదల చేయడం ప్రభుత్వ ప్రాధాన్యం కాదా? మూడు ప్రావిన్సులలో ప్రభుత్వం ఉన్నప్పటికీ, మండలిలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు? ఈ ప్రభుత్వానికి (Imran Khan Govt) దేశాన్ని నడిపించే సామర్థ్యం లేదు. లేదా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది’ అని మండి పడింది. గత రెండు నెలలుగా కామన్ ఇంటరెస్ట్ కౌన్సిల్ (సీసీఐ) సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం ఎందుకు అవుతున్నారంటూ మండిపడిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
సీసీఐ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మంచి పనులను రహస్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి? ఇలా చేయడం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని జస్టిస్ ఖాజీ ఫేజ్ ఇసా అన్నారు. దేశం ఈ పద్ధతిలో నడుస్తుందా అని అడిగిన న్యాయమూర్తి.. ప్రావిన్స్‌తోపాటు కేంద్రం ఏమి చేస్తున్నాయో దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని అక్కడి పత్రికలు నివేదించాయి. పంజాబ్ స్థానిక ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకటించడంపై ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పంజాబ్ ప్రభుత్వం ఇష్టపడటం లేదని, ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు మొత్తం పంజాబ్ అసెంబ్లీ బైపాస్ అయిందని జస్టిస్ ఇసా అన్నారు. సీసీఐ మార్చి 24 న సమావేశమవుతుందని అదనపు అటార్నీ జనరల్ (ఏఏజీ) కోర్టుకు తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశం అయినందున అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది.