AstraZeneca Vaccine: వ్యాక్సిన్‌తో గడ్డ కడుతున్న రక్తం, ఆస్ట్రాజెనెకా టీకాను తాత్కాలికంగా నిషేధించిన యూరప్ దేశాలు, తమ టీకా సురక్షితమేనని భరోసా ఇచ్చిన ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ
AstraZeneca logo (Photo Credits: Website)

London, March 15: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కు (AstraZeneca Vaccine) పలు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యాక్సిన్ వాడకం అనంతరం రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్లు పడిపోవడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయంటూ డెన్మార్క్, ఆస్ట్రియా, ఎస్టోనియా, లిథువేనియా, నార్వే, థాయిలాండ్, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లండ్, బల్గేరియా వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) వినియోగంపై ఈ దేశాలన్నీ తాత్కాలిక నిషేధం విధించాయి. ఇప్పటికే 50 లక్షల మంది యూరోపియన్లు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఈ ఘటనతో ప్రజలు, వైద్య వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా (AstraZeneca) తాజాగా స్పందించింది. తమ టీకా సురక్షితమేనని (No Evidence of High Blood Clot Risk) భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. సాధారణంగా సంభవించే బడ్ల క్లాట్స్‌తో పొలిస్తే.. ఈ ఘటన సంఖ్య తక్కువగా ఉంది. ఇతర వ్యాక్సిన్ల విషయంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉందని కామెంట్ చేసింది.

దీనికి మద్ధతుగా ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ.. టీకాతో ఉన్న రిస్క్ కంటే దాని వల్ల కలిగే ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించింది. అలాగే ఈ వాక్సీన్‌కు, రక్తంలో గడ్డలు ఏర్పడటానికి మధ్య సంబంధం ఉందనే దాఖలాలు ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం

ఇక ఈ వాక్సీన్ వల్ల రక్తంలో గడ్డలు తయారవుతున్నాయని ఆధారాలు సూచించటం లేదని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది. దేశ ప్రజలు ఈ వాక్సీన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే... ''వాక్సీన్ గురించి ఎలాంటి సందేహాలకూ మేం తావివ్వలేం. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి దీని వినియోగం ఆపటం మంచిది'' అని డచ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే యూరప్ ఖండంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. దీనికి తోడు.. టీకా లబ్ధిదారుల్లో రక్తం గడ్డకడుతున్న ఘటనలు టీకా కార్యక్రమంపై మరింత ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

మళ్లీ డేంజర్ బెల్స్..నిన్న 25 వేలు కాగా నేడు 26 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

ఈ నేపథ్యంలో రెండు వారాల పాటు దేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్నట్టు నెదర్లాండ్స్ జాతీయ ఔషధాల పనితీరు నిర్ధారణ బోర్డు ప్రకటించింది. ఈ నిషేధం మార్చి 28 వరకు వర్తిస్తుందని నెదర్లాండ్స్ ఆరోగ్యశాఖ మంత్రి హ్యోగో డి జోంగే వెల్లడించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పై అనుమానాలు ఉన్నప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

ఇక భారత్‌లోని టీకా కార్యక్రమంలో ఆస్ట్రాజెనెకా టీకాను వినియోగిస్తున్నందున ఈ పరిణామాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై స్పందించిన భారత్.. దేశంలో వినియోగిస్తున్న రెండు టీకాలను మరింత లోతుగా అధ్యయనం చేస్తామని ఇటీవలే ప్రకటించింది.