India Coronavirus: మళ్లీ డేంజర్ బెల్స్..నిన్న 25 వేలు కాగా నేడు 26 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
Medical workers (Photo Credits: IANS)

New Delhi, Mar 15: దేశంలో నిన్న 25 వేల పై చిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు (India Coronavirus) దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో 1,10,07,352 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2,19,262 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 17,455 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 2,99,08,038 మంది వ్యాక్సిక్‌ తీసుకున్నారని తెలిపింది. దేశంలో మార్చి 14 నాటికి మొత్తం 22,74,07,413 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 7,03,772 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టంతో అక్క‌డి అధికారులు లాక్‌డౌన్ (Lockdown) విధించారు. సోమ‌వారం నుంచి వారం రోజుల‌పాటు సిటీ అంత‌టా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌లవుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఇవాళ తెల్ల‌వారుజ‌ము నుంచే నాగ్‌పూర్‌లో కంప్లీట్ లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ లాక్‌డౌన్ అమ‌లు కోసం అధికారులు నాగ్‌పూర్ వీధుల్లో భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు.

గుంటూరులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 48 కేసులు, ఏపీలో తాజాగా 298 మందికి కరోనా, ఇద్దరు మృతితో 7,184కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య

రోడ్ల‌పై పోలీస్ ప‌హారాతోపాటు, వారంపాటు నగ‌ర‌మంతటా నిరంత‌ర‌ గ‌స్తీ కొన‌సాగుతుంద‌ని నాగ్‌పూర్ పోలీస్ క‌మిష‌న‌ర్ అమితేష్ కుమార్ తెలిపారు. ఈ వారం రోజుల్లో అన‌వ‌స‌రంగా వీధుల్లోకి వ‌చ్చే వారిపైన‌, ఇత‌ర కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపైన‌ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో నైట్ కర్ఫ్యూ విధించారు.గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 16,620 కరోనా కేసులు నమోదైనాయి. ఆదివారం ఒక్కరోజే కరోనాతో 50మంది మరణించారు. లాతూరు జిల్లాలో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడంతో రాత్రి 8గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధించారు. కరోనా హాట్ స్పాట్ అయిన మీరా భయందర్ లో మార్చి 31వతేదీ వరకు లాక్ డౌన్ విధించారు.పూణే నగరంలోనూ నైట్ కర్ఫ్యూ విధించారు

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం ఉదయం ముంబై నగరంలోని మార్కెటులో ప్రజలు ముక్కు కింద మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించక పోవడం, పెద్ద ఎత్తున జనం ఒకచోట గుమిగూడటాన్ని సీఎం ఠాక్రే తీవ్రంగా పరిగణించారు.ముంబై నగరంలో గత 24 గంటల్లో 1962 కరోనా కేసులు నమోదు అయినా సోమవారం ఉదయం దాదర్ మార్కెటులో భారీగా జనం గుమిగూడటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెకండ్ వేవ్ భయం, మళ్లీ లాక్‌డౌన్ దిశగా రాష్ట్రాలు, దేశంలో మళ్లీ 25 వేలు దాటిన కరోనా కేసులు, మాస్కు సరిగా లేకుంటే విమానంలో నుంచి దింపేయాలని డీజీసీఏ ఆదేశాలు, తెలంగాణలో కొత్త‌గా 228 కోవిడ్ కేసులు, మహారాష్ట్రలో ఆగని కరోనా కల్లోలం

దాదర్ మార్కెటులో ప్రజలు కొవిడ్ కనీస నిబంధనలు పాటించక పోవడంపై సీఎం తుది హెచ్చరిక జారీ చేశారు. నాగపూర్ నగరంలో మార్చి 15వతేదీ నుంచి మార్చి 21 వతేదీ వరకు కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే లాక్ డౌన్ విధించక తప్పదని సీఎం ఠాక్రే హెచ్చరించారు.కఠిన మైన లాక్ డౌన్ విధించే పరిస్థితిని ప్రజలు తీసుకురావద్దని సీఎం తుది హెచ్చరిక జారీ చేశారు.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల విషయమై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. ‘తాను గతంలోనే కోవిడ్-19 మరింత ప్రమాదకారి కానున్నదని అప్రమత్తం చేశానన్నారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని’ సూచించారు.