Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Mar 14: దేశంలో కొత్త కేసుల సంఖ్య మ‌ళ్లీ 25 వేలు దాటింది. గత 24 గంటల్లో 25,320 మందికి కరోనా నిర్ధారణ (Covid Updates in India) అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 16,637 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కు ( Coronavirus in india) చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 161 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,607 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,89,897 మంది కోలుకున్నారు. 2,10,544 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,97,38,409 మందికి వ్యాక్సిన్లు వేశారు.

తెలంగాణలో కొత్త‌గా 228 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 152 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,515 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,653గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,993 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 795 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 46 మందికి క‌రోనా సోకింది.

ల‌క్ష మందికి పైగా మృతి, షాపులు, రెస్టారెంట్లు, స్కూళ్ల‌ు మూసివేయాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం, ఆక్స్‌ఫ‌ర్డ్‌ వ్యాక్సిన్ ఆపాల్సిన అవసరం లేదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, జాన్సన్ అండ్‌ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం

కర్ణాటకలో సుమారు 48 రోజుల తర్వాత రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాదిలో జనవరి 23వ తేదీన గరిష్టంగా 902 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గత శుక్రవారం 833 పాజిటివ్‌లు వెలుగుచూశాయి. సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా కరోనా టీకా వేశారు. శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 9,58,417 ఉంది.

రాజధాని బెంగళూరులో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 71 రోజుల తర్వాత 500 సంఖ్య దాటింది. మహరాష్ట్రలో మాదిరిగా లాక్‌డౌన్‌ విధిస్తారేమోనని బెంగళూరుతో పాటు పలు జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. పాజిటివ్‌ కేసుల కన్నా డిశ్చార్జిల సంఖ్య తగ్గడం మహమ్మారి తీవ్రతకు నిదర్శనం. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా కర్ణాటకలో తొలిసారిగా వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించి మార్చి 14నాటికి ఏడాది పూర్తయింది

దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా

విమానాల్లో ముక్కు, నోటిని మాస్కుతో పూర్తిగా కప్పి ఉంచకపోతే నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేయాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) దేశంలో అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విమానాల్లో కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో పౌర విమానయాన సంస్థలకు డీజీసీఏ శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు.

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల నమోదు 15 వేలు దాటింది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 15,602 కరోనా కేసులు, 88 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,97,793కు, మర­ణాల సంఖ్య 52,811కు చేరింది. ముంబై నగరంలో ఈ ఏడాదిలో గరిష్ఠంగా 1,709 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశంలో మళ్లీ కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం, బెంగళూరులో నమోదైన రెండు సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు, బళ్లారిలోని ట్రామాకేర్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్న వైద్యులు

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 7,467 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,25,211కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,18,525 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. కరోనా తీవత్ర నేపథ్యంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.