Coronavirus Scare: ల‌క్ష మందికి పైగా మృతి, షాపులు, రెస్టారెంట్లు, స్కూళ్ల‌ు మూసివేయాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం, ఆక్స్‌ఫ‌ర్డ్‌ వ్యాక్సిన్ ఆపాల్సిన అవసరం లేదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, జాన్సన్ అండ్‌ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం
Coronavirus Outbreak in Italy. (Photo Credits: AFP)

Rome, Mar 13: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. దేశాలకు దేశాలే మళ్లీ చీకటిలోకి వెళ్లిపోయేలా ఉన్నాయి. అగ్ర దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ కరోనావైరస్ కల్లోలం (Coronavirus Scare) ఆగడం లేదు. తాజాగా ఇట‌లీలో వైర‌స్ కేసులు అధికం అవుతున్న నేప‌థ్యంలో అక్కడ మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు ( Italy to shut shops and schools) అమ‌లు చేయ‌నున్నారు. షాపులు, రెస్టారెంట్లు, స్కూళ్ల‌ను సోమ‌వారం మూసివేయ‌నున్నారు. ఏప్రిల్‌లో జ‌రిగే ఈస్ట‌ర్ వేడుక వ‌ర‌కు ష‌ట్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసేందుకు ఇట‌లీ ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.

గ‌త ఏడాది ఆరంభంలో క‌ఠిన‌మైన లాక్‌డౌన్ పాటించిన ఇట‌లీ.. మ‌ళ్లీ వైర‌స్ కేసుల‌ను అదుపు చేసేందుకు ఇబ్బందిప‌డుతోంది. ఇప్ప‌టికే ఆ దేశంలో కోవిడ్ వ‌ల్ల ల‌క్ష మందికిపైగా మృతిచెందారు. బ్రిట‌న్ త‌ర్వాత యూరోప్‌లో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు అయిన దేశాల్లో ఇట‌లీ రెండ‌వ స్థానంలో ఉన్న‌ది.

ఇదిలా ఉంటే కరోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో 10 దేశాల నుంచి ఒమన్‌కు రాక‌పోక‌ల‌పై ఇప్ప‌టికే నిషేధం విధించారు. తాజాగా ఒమ‌న్‌కు చెందిన సుప్రీం క‌మిటీ ఆ నిషేధాన్ని పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు నిషేధం కొనసాగుతుందని కమిటీ స్ప‌ష్టంచేసింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఒమ‌న్ నిషేధం విధించిన ప‌ది దేశాల జాబితాలో సూడాన్, లెబనాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, ఘనా, గినియా, సియెర్రాలియోన్, ఇథియోపియా ఉన్నాయి. అయితే, సుల్తానేట్‌లోని విదేశీ మిషన్ల దౌత్యవేత్తలు, దేశంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులకు ఈ నిషేధ ఆంక్షల నుంచి సుప్రీం కమిటీ మినహాయింపునిచ్చింది.

దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా

ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిడ్‌-19 వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) శుక్ర‌వారం స్ప‌ష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ర‌క్త గ‌డ్డ క‌డుతున్న‌దంటూ ప‌లు దేశాలు ఈ వ్యాక్సిన్‌ను నిలిపేయ‌డంపై డ‌బ్ల్యూహెచ్‌వో స్పందించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని కొన‌సాగించాలి. దానిని వాడ‌కూడ‌ద‌నడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని డ‌బ్ల్యూహెచ్‌వో అధికార ప్ర‌తినిధి మార్గ‌రెట్ హ్యారిస్ అన్నారు. డెన్మార్క్‌, నార్వే, ఐస్‌ల్యాండ్‌లాంటి యురోపియ‌న్ దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌ను తాత్కాలికంగా నిలిపేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా ఈ వ్యాక్సిన్ వినియోగించాల‌ని సూచించింది. అందులోని ప్ర‌మాదాల కంటే ప్ర‌యోజ‌నాలే ఎక్కువ అని ఆ ఏజెన్సీ స్ప‌ష్టం చేసింది.

కరోనాతో కన్నుమూసిన 37 రోజుల పసిబిడ్డ, 17 రోజుల పాటు కోవిడ్‌తో పోరాడి ఓడిన శిశువు, ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందంటూ ట్వీట్ చేసిన గ్రీస్ ప్ర‌ధాన‌మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్

అమెరికన్ ఔషధ సంస్థ జాన్సన్ అండ్‌ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించింది. ఇప్పుడు అంతర్జాతీయ కోవాక్స్ ప్రచారం కింద పేద దేశాలకు సరఫరా చేసే అవ‌కాశాలు ఉన్నాయి. రెండు డోసుల‌కు బ‌దులుగా ఒక డోస్ మాత్ర‌మే తీసుకోవ‌డం జాన్సన్ అండ్‌ జాన్సన్ టీకా యొక్క ప్రత్యేక లక్షణం. టీకాలు వేయడం అవసరం లేకపోతే, అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని ఆపాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఇది అద్భుతమైన టీకా అని సంస్థ ప్రతినిధి మార్గరెట్ హారిస్ చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దుష్ప్రభావాల ఫిర్యాదులు కొన్ని వ‌స్తున్న‌ప్ప‌టికీ.. బలమైన ఆధారాలు లేవు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ సలహా కమిటీ ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్న‌ది. అయితే, టీకా కార్యక్రమాన్ని ఆపడం సరైనది కాదని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయ‌ప‌డింది.