Coronavirus in India (Photo-PTI)

Bengaluru; Mar13: దేశంలో వ్యాక్సిన్ మీద ఆశలు చిగురించిన నేపథ్యంలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (South African strain) కలకలం రేపుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా రెండు సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు (Two more South African strains of COVID-19) నమోదయ్యాయి. కరోనా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న నేపథ్యంలో ఈ కొత్త వైరస్ కర్ణాటక రాఫ్ట్రాన్ని వణికిస్తోంది. గత నెల 17న దుబాయ్‌ నుంచి బెంగళూరుకు చేరుకున్న అన్నాచెల్లెలికి ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

బళ్లారికి చేరుకున్న ఇద్దరికీ గతనెల 20న జ్వర లక్షణాలు కనిపించడంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తనమూనాలను బెంగళూరు నిమ్హాన్స్‌ ఆస్పత్రిలోని ప్రయోగశాలకు పంపించగా సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ కరోనా సోకినట్లు ధ్రువపడినట్లు జిల్లా అధికారులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కాన్నారు. బాధితులను బళ్లారిలోని ట్రామాకేర్‌ సెంటర్‌లో చికిత్స అందించి హోం క్వారంటైన్‌లో ఉంచారు.

దుబాయ్‌కు వెళ్లి వచ్చిన శివమొగ్గకు చెందిన 53 సంవత్సరాల వయసున్న వ్యక్తికి సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి. కే.ఎస్‌. ఈశ్వరప్ప తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెగ్గాన్‌ అస్పత్రికి వెళ్లి విచారించగా దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలాంటి కరోనా లేదని, వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారన్నారు. అతన్ని కలిసిన 39 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగిటివ్‌ వచ్చిందన్నారు. కాగా శివమొగ్గ జిల్లా అరోగ్య,శాఖ ఆధికారి డాక్టర్‌ రాజేష్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భారత్‌లో కరోనా సెకండ్ ఇన్నింగ్స్, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,285 కేసులు నమోదు, మహారాష్ట్రలో వైరస్ వీరవిహారం, 14 వేలకు పైగా కొత్త కేసులు ఈ రాష్ట్రం నుంచే

రాష్ట్రంలో 833 కొత్త COVID-19 కేసులు మరియు ఐదు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,58,417కు చేరుకుంది. ఇందులో 12,386 మరణాలు మరియు 9,37,898 డిశ్చార్జెస్ ఉన్నాయి అని ఆరోగ్య శాఖ ఒక బులెటిన్లో తెలిపింది.

మార్చి 10 న దక్షిణాఫ్రికా జాతితో మొట్టమొదటి COVID-19 పాజిటివ్ కేసు శివమొగ్గలో కనుగొనబడింది. సానుకూల కేసుల జాబితాలో బెంగళూరు మొత్తం 4,10,181 కేసులతో అగ్రస్థానంలో ఉంది. మైసూరు 54,367, బల్లారి 39,386 తరువాతి స్థానాల్లోఉన్నాయి.