Kamran Akmal: పాక్ మాజీ క్రికెటర్ ఇంట్లో మేక దొంగతనం, బక్రీద్ కోసం తెచ్చిన మేకను ఎత్తుకెళ్లిన దొంగలు, మంచి దిట్టమైన మేకను చూసి దొంగిలించిన దుండగులు, పోలీసులకు క్రికెటర్ తండ్రి ఫిర్యాదు
అయితే అందులో నుంచి ఒకమేకను దొంగలు కొట్టేసినట్లు(Goat stolen) కుటుంబ సభ్యులు గుర్తించారు. దొంగతనానికి గురైన మేక ఖరీదు దాదాపు 35వేల వరకు ఉంటుందని కమ్రాన్ అక్మల్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
Lahore, July 08: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ (kamran Akmal) మరోసారి వార్తల్లో నిలిచాడు. లాహోర్(Lahore) లోని తన తన ఇంటి ఆవరణలో కట్టేసిన మేకను దొంగలు ఎత్తుకెళ్లారని కంప్లైంట్ చేశాడు. బక్రీద్ (Bakri Eid)కోసం ఆరు మేకలను(Goats) తెచ్చిన కమ్రాన్ అక్మల్ ఫ్యామిలీ...వాటిని ఆరుబయట కట్టేసింది. అయితే అందులో నుంచి ఒకమేకను దొంగలు కొట్టేసినట్లు(Goat stolen) కుటుంబ సభ్యులు గుర్తించారు. దొంగతనానికి గురైన మేక ఖరీదు దాదాపు 35వేల వరకు ఉంటుందని కమ్రాన్ అక్మల్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనిపై పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినట్లు కమ్రాన్ అక్మల్ తండ్రి తెలిపాడు. ఈనెల 10న బక్రీద్ పండగను (Bakri Eid)ముస్లింలు ఘనంగా జరుపుకోనున్నారు. భారత్, పాకిస్తాన్ దేశాలతో పాటు ఆరు ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, ఈజిప్ట్, ఒమన్ ప్రజలు బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు.
ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడానికే ముస్లింలు మేకలను కొనుగోలు చేస్తుంటారు. తాముకూడా బక్రీద్ కోసం ఆరు మేకలను కొనుగోలు చేసినట్లు చెప్పాడు. తెల్లవారుజామును మూడు గంటల ప్రాంతంలో ఈ దొంగతనం (Theft) జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆరు మేకల్లోనూ దొంగలు ఎత్తుకెళ్లిన మేక ఎంతో శ్రేష్టమైనది అని, సరిగ్గా దొంగలు కూడా దాన్నే ఎత్తుకుపోయారని అంటున్నారు. కమ్రాన్ అక్మల్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.
ఇక కమ్రాన్ అక్మల్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ టీంలో వికెట్ కీపర్ గా అతడు ఎంట్రీ ఇచ్చాడు. 53 అంతర్జాతీయ టెస్టులు ఆడిన అతడు 2,648 పరుగులు చేశాడు. ఇక 157 అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహించిన అతడు 3,236 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో 58 మ్యాచ్ లు ఆడి 987 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 6 మ్యాచ్ లు ఆడి 128 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పేలవ వికెట్ కీపింగ్.. చెత్త బ్యాటింగ్ తో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ దేశవాళి క్రికెట్ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నాడు.